స్టార్‌ హీరో విక్టరీ వెంకటేష్ అసలు పేరు ఏమిటో తెలుసా.. ఎవరు ఊహించరు..!?

చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా ఉన్న వారిలో చాలామంది తమ అసలు పేరు కంటే సినిమాల్లో బాగా పాపులర్ అయిన పేర్లతోనే భారీ క్రేజ్‌ను అందుకుంటారు. అదేవిధంగా సినిమాల్లోకి వచ్చాక వాళ్లకు ఉన్న ఇమేజ్‌ను బట్టి అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు ఏదో ఒక బిరుదును తగిలించేస్తాయి. దీంతో సదరు హీరో లేదా హీరోయిన్ అసలు పేరు కంటే అభిమానులు ముందుగా పిలుచుకునే ఆ పేరుతోనే ఎక్కువగా పాపులర్ అవుతారు.

ఇక మన టాలీవుడ్ సీనియర్ హీరోల్లో చిరంజీవిని- మెగాస్టార్ గా, బాలకృష్ణ అని నట‌సింహంగా, నాగార్జున కింగ్ గా, వెంకటేష్ ను విక్టరీ బిదురుతో.. వీరి తర్వాత వచ్చిన హీరోల్లో ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ గా, అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్ గా, రామ్‌చరణ్‌ను మెగా పవర్ స్టార్ గా, మహేష్ ను సూపర్ స్టార్ గా అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. మన టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే టాలీవుడ్ దివంగత లెజెండ్రి నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు.

ఇక తండ్రి రామానాయుడు టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాతగా దూసుకుపోతే వెంకటేష్‌ అందుకు భిన్నంగా హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో సినిమాల్లో నటిస్తూ నాటి నుంచి నేటి వరకు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ తన కెరీర్లో 70 శాతానికి పైగా విజయాలు సొంతం చేసుకున్నారు.
సినిమాల్లో వ‌రుస‌ విజయాలు రావడంతో వెంకటేష్‌ను అభిమానులు విక్టరీ అనే బిరుదుతో ముద్దుగా పిలుచుకునేవారు. దీంతో వెంకటేష్ కాస్త విక్టరీ వెంకటేష్ అయిపోయాడు. ఇదే సమయంలో వెంకటేష్ అసలు పేరు దగ్గుపాటి వెంకటేశ్వర్లు. ఆ పేరు వెంకటేష్ తాత గారి పేరు. రామానాయుడు తన తండ్రి మీద ప్రేమతో తన చిన్న కొడుకుకి ఆ పేరు పెట్టుకున్నాడు.

వెంకటేష్ అంటే చిన్నప్పటి నుంచి రామానాయుడు గారి ఇంట్లో ఎంతో గారం చూపించేవారు. ఇక చెన్నైకి వచ్చాక స్కూల్లో జాయిన్ అయినప్పుడు కొన్ని కారణాలవల్ల స్కూల్ రికార్డుల్లో వెంకటేశ్వర్లు కాస్త వెంకటేష్ గా మారింది. అయితే వెంకటేష్ కు తన అసలు పేరు అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే తన సినిమాల్లో ఏ మాత్రం అవకాశం వచ్చినా వెంకటేశ్వర్లు పేరుతో నటించారు. విచిత్రమేంటంటే వెంకటేశ్వర్లు పేరుతో నటించిన సినిమాలు అన్ని ఆయనకు విజయాన్ని అందించాయి. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మేన‌కోడ‌లు నీర‌జ‌ను పెళ్లాడిన వెంక‌టేష్‌కు ముగ్గురు కుమార్తెలు.. ఓ కుమారుడు ఉన్నారు.