ఆ సినిమాతో భారీ హిట్ కొట్టింది.. అయినా ఈ ముద్దుగుమ్మకు ఒక్క అవకాశం రాలేదేంటి..

ఇటీవలే విడుదల అయిన బేబీ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. యూట్యూబ్ వీడియోస్ లో నటించే సమయంలో వైష్ణవి కి ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. అంతకుముందు కొన్ని సినిమా లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికి పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

‘బేబీ’ చిన్న సినిమా నే అయిన్నప్పటికి ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. బేబీ సినిమా అంత పెద్ద హిట్ అయింది కాబ్బటి వైష్ణవి కి ఆఫర్స్ క్యూ కడతాయాని అంత అనుకున్నారు. కానీ బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 50 రోజులు అవుతున్నా కూడా వైష్ణవి కి మాత్రం ఆఫర్స్ రావడం లేదు. అయితే బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వం లో వస్తున్న మరో సినిమా లో కూడా వైష్ణవి నటిస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. బేబీ సినిమా లో ఆమె నటన అద్భుతంగా ఉన్నపటికీ తెలుగు దర్శకనిర్మాతలు ఆమెకి  అవకాశం ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు.

సినీ ప్రముఖులు చాలా మందే వైష్ణవి నటనకు ప్రశంసల వర్షం కురిపించారు . చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ పోతినేని లాంటి స్టేర్ హీరోలు ఆమె నటనకి ఫిదా అయ్యారు. కానీ వారి సినిమాలో నటించే అవకాశం ఇవ్వడానికి మాత్రం ఆలోచిస్తున్నారు. నటన పరంగా 90 మార్కులు సంపాదించుకున్న వైష్ణవి అవకాశాల పరంగా మాత్రం వెనుకబడిపోతుంది. తెలుగు అమ్మాయి అవ్వడం వల్లనే ఈ ముద్దుగుమ్మ కి ఆఫర్స్ రావడం లేదని అంత అనుకుంటున్నారు. మరి రాభోయే రోజుల్లో అయిన వైష్ణవి ని మన తెలుగు డైరెక్టర్స్ గుర్తించి మంచి అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.