ర‌జ‌నీకాంత్ “ జైలర్ ” కి ఫస్ట్ ఎవర్ రివ్యూ.. బాక్సాఫీస్ షేక్‌…!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం న‌టిస్తున్న‌ సినిమా “జైలర్” ఈ నెల 11 ప్రేక్ష‌కుల‌ ముందుకు రానుంది. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్‌ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెర్కెక్కించాడు. ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సిని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా రజనీకాంత్ కూడా ఈ సినిమాపై ఎన్నో వంచనాలను పెట్టుకున్నాడు. ఇప్పటికే టీజర్, టైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన తమన్నా ఐటెం సాంగ్ కూడా ఏ రేంజ్ లో యూట్యూబ్ ని షెక్ చేసిందో అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అనిరుద్ ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశాడు.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైర‌ల్‌ గా మారింది. అనిరుద్ తన పోస్టులో జైల‌ర్‌ సినిమా సూపర్ హిట్ అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది.

 

అయితే దీన్ని జైలర్‌కు వచ్చిన మొదటి రివ్యూ గా నెటిజ‌న్లు అనిరుద్ పెట్టిన పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా అనిరుద్ త‌న గ‌త సినిమాల‌కు ఇలా విడుద‌ల‌కు ముందు సినిమా రిజల్ట్ ఇది అంటూ ఎప్పుడు చేయలేదు. కానీ జైలర్ మూవీ విష‌యంలో మ‌త్రం ఇలా చేయడంతో మ‌రోసారి ఈ మూవీ పై అంచ‌న‌లు పెర‌గాయి.