క్ష‌ణాల్లో రెడీ అయ్యే సౌత్ ఇండియ‌న్ ఫాస్ట్ రెసిపీస్ ఇవే…!

ఈ కాలంలో వంటింట్లో ఎక్కువసేపు చేయాలంటే చిరాకు వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు చెప్పా పెట్టకుండా ఇంటికి గెస్టులు వస్తూ ఉంటారు. వాళ్లకి ఫాస్ట్‌గా ఏ టిఫిన్ రెడీ చేయాలో ? అర్థం కాదు. అతి రుచికరమైన సౌత్ ఇండియన్ రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పెరుగన్నం:
టేస్ట్ తో పాటు మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది. అన్నంలో పెరుగుతో పాటు కొన్ని మసాల దినుసులు కలిపి దీనిని తాలింపు పెట్టుకుని తింటే ఆ రుచి చాలా బాగుంటుంది.

ఇడ్లీ:
మినప్పప్పు, ఇడ్లీ రవ్వతో తయారు చేసే ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు నూనె లేకుండా చేయడం వల్ల కొలెస్ట్రాల్ కూడా ఉండదు.

దోశ:
సౌత్ ఇండియన్ స్పెషల్ అయినా దోశ. మినప్పప్పు, బియ్యం మిక్సీ పట్టి ఉదయాన్నే 10 నిమిషాల్లో దోస వేసుకోవచ్చు. తొందరగా అయిపోయే రెసిపీల్లో ఇది కూడా ఒకటి.

చిల్లీ చట్నీ:
బ్రేక్ ఫాస్ట్ లోకి చాలామంది చెల్లి చట్నీ లేదా ఎండుమిర్చి చట్నీ నా ఇష్టపడతారు. మిర్చీలతోపాటు కొత్తిమీర చట్నీ కూడా టిఫిన్ లో చాలా బాగుంటుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

పులిహార:
తొందరగా అయిపోయే సౌత్ ఇండియన్ స్పెషల్ ఫుడ్ ఇది. దీంట్లో నిమ్మకాయ, తాలింపులు, కరివేపాకు లాంటి వాడతాము. నిమ్మకాయలో విటమిన్ సి అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే కరివేపాకు కూడా కంటి సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

పకోడీ:
సౌత్ ఇండియాలో స్పెషల్ అయిన పకోడీ చాలా రుచికరంగా ఉంటుంది. వర్షం పడినప్పుడు వేడివేడిగా పకోడీ వేసుకున్న తింటే ఆ టేస్టే వేరు. సెనగ పిండితో తయారు చేసే ఈ పకోడీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.