అల్లు అర్జున్ నేషనల్ అవార్డుని రూ. 20 కోట్లు పెట్టి కొనుక్కున్నాడా…..!!

తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ రావడంతో తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. కానీ కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కంటే గొప్పగా నటించిన నటులు ఉన్నారు. వాళ్లకు ఇవ్వకుండా బన్నీకే అవార్డు ఎందుకు ఇచ్చారు? ఆనీ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు అల్లు అర్జున్ ఈ అవార్డును రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కున్నాడు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణ వందల సినిమాల్లో నటించారు. వారికి ఈ అవార్డు లభించడం కష్టమా? అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతో బన్నీ అభిమానులు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు.

డబ్బులతో అవార్డులు కొనేలా ఉంటే బన్నీ ఈ 20 ఏళ్లలో ఎన్నో నేషనల్ అవార్డులు అందుకునేవాడు. టాలీవుడ్ లో బన్నీ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న హీరోలు సైతం ఉన్నారు. వాళ్లు తలుచుకుంటే ఈ అవార్డ్ కోసం రూ. 10 నుంచి 20 కోట్లు రూపాయలు ఖర్చు చేయగలరు. అని గట్టిగా రిప్లై ఇస్తున్నారు బన్నీ ఫాన్స్.