స‌ఖి, ఓకే బంగారం సినిమాల‌కు కాపీగా `ఖుషి`.. స్వ‌యంగా ఒప్పేసుకున్న ద‌ర్శ‌కుడు!

ఖుషి.. మ‌రికొద్ది రోజుల్లో ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మూవీ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా లెవ‌ల్ లో నిర్మించారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తే.. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వ‌రాలు అందించాడు.

సెప్టెంబ‌ర్ 1న ఖుషి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ సినిమాపై మంచి అంచ‌నాలు పెంచాయి. ప్ర‌మోష‌న్స్ తో మ‌రింత హైప్ ను పెంచుతున్నాయి. ఓ జంట ప్రేమ‌, పెళ్లి బంధం నేప‌థ్యంలో ఫీల్‌గుడ్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. అయితే ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత ఖుషి పాత సినిమాల‌న్నీ మిక్సీ వేసి కొట్టిన‌ట్లు ఉంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు.

ముఖ్యంగా స‌ఖి, ఓకే బంగారం సినిమాలకు ఖుషి కాపీలా ఉందంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాజాగా ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఈ ప్ర‌చార‌మే నిజ‌మే అని ప‌రోక్షంగా ఒప్పేసుకున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో స‌ఖి, ఓకే బంగారం సినిమాల‌తో ఖుషిని కంపేర్ చేస్తూ వ‌చ్చిన వార్త‌ల‌పై మీ రియాక్ష‌న్ ఏమిట‌ని అడ‌గ‌గా.. అందుకు శివ నిర్వాణ `ఖుషి సినిమా చూస్తుంటే ప్రేక్ష‌కుల మ‌దిలో చిర‌స్థాయిగా నిలిచిన కొన్ని క్లాసిక్ సినిమాలు గుర్తొస్తాయి. క్లాసిక్ సినిమాలు గుర్తొచ్చిన త‌ప్పులేదు` అని పేర్కొన్నాడు. దీంతో ఈయ‌న వ్యాఖ్య‌లు కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.