వామ్మో.. ఇండియాలో ఏడాదికి అని లక్షల జంట‌లు విడాకులు తీసుకుంటున్నాయా.. కార‌ణాలు ఇవేనా..

దేశంలో ప్రతియేటా 10లక్షలు పైగా జంటలు విడిపోతున్నాయి. ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదు. ఈ జనరేషన్ వాళ్లు ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. చేసుకున్నా కూడా సంవత్సరం తిరగకముందే విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా విడాకులు కోరుకుంటున్నారు. ఈ విడాకులు ఎక్కువగా భారతదేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ అవుతున్నాయి. అనేక మనస్పర్ధలు కారణంగా విడాకులను కోరుకుంటున్నారు. గ్రామీణ భారతదేశంలో ఈ జ‌న‌రేష‌న్‌లో నమోదవుతున్న విడాకుల వ్యవహారాల్లో కూడా కుటుంబ సమస్యలే ఎక్కువగా ఉంటాయి.

పెళ్లికి ముందు పెద్దగా ఆలోచించకుండా, లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇలాంటి వారిలో విడిపోయే మనస్వత్వం ఉన్నవారు పెద్ద సమయం తీసుకోరు. పెళ్లయిన 3రోజులకే పుట్టింటికి వెళ్ళిపోవడం, లేదా ఇద్దరి మధ్యన కాపురం ఎక్కువ సమయం సాగలేదని చెప్పేవారే భారతదేశంలో కనిపిస్తారు. పెద్ద కుటుంబం అని అత్తారింట్లో అమ్మాయి ఉండలేకపోయిందని అమ్మాయి తరఫు వాళ్లు రీజన్ చెబుతారు. ఇక అబ్బాయి తరుఫు నుంచి అమ్మాయి తీరు సరిగా లేదని, పెద్దవాళ్ళను పట్టించుకోవడంలేదని, అహంకారం ఇలా అనేక రీసన్లు చెబుతూ ఉంటారు.

అయితే తమ మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడలేదని, ప్రేమ కలగలేదని రీజన్ ను చెప్పరు. బహుశా సిటీ లైఫ్ స్టైల్ లో ఇలాంటి మాటలు ఏమన్నా వినిపిస్తాయేమో కానీ… పల్లెటూర్లలో మాత్రం ఏ ఒక్కరూ అలా చెప్పరు. అమ్మాయి కోరుకున్న లైఫ్ స్టైల్‌ని ఇవ్వకపోవడం, ఇంతకుముందే ఎఫైర్ ఉండడం, ఆఫీస్ బిజినెస్ అంటూ బిజీగా ఉండడం వల్ల అమ్మాయికి విసుగొచ్చి విడాకులు కోరుకుంటుంది. ఇక సెమీ అర్బన్ లో విడాకులకు రీజన్లలో ఎక్స్ట్రా మేరిటన్ అఫైర్స్ కూడా ఉంటున్నాయి.

ఎఫైర్స్ కు ఆధారాలు లభించడం, లేదా పూర్తిగా పెళ్లి తరువాత మరొకరితో లేచిపోవడం… ఇలాంటి కేసులు అర్బన్ పోలీస్ స్టేషన్లలో ఎక్కువగానే నమోదవుతూ ఉంటాయి. ఇక విడాకుల విషయంలో మరో ముఖ్యమైన రీసన్ డొమెస్టిక్ వయోలెన్స్. ఫిజికల్ అబ్యూజ్ లేదా మెంటల్ అబ్యూజ్. దీన్ని భరిస్తూ కాపురం చేసేవారు భారత దేశంలో కొదవలేదు. అయితే విద్యాధికా సమాజంలో, ఉద్యోగాలు చేస్తూ కూడా దీనిని భరించే ఓపిక లేని వారు విడాకులు మార్గాన్ని ఎంచుకుంటున్నారు.