బాలయ్య కి ఆ హీరోయిన్ అంటే మహా ఇష్టం.. కానీ ఆమె చేసిన పనికి చంపేయాలి అన్నంత కోపం..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు. కాగా ఆయన వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలయ్య సైతం అదే ఇమేజ్ ని కొనసాగిస్తూ వచ్చాడు . మనకు తెలిసిందే నందమూరి బాలయ్య అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఉండరు. ఆయన కోపానికి భయపడే జనాలు ఉంటారేమో కానీ ..ఆయన నటనను ఆయన డైలాగ్స్ ను ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు .

అలాంటి పేరు సంపాదించుకున్నాడు బాలయ్య . అయితే అలాంటి బాలయ్యకు ఓ హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం . కానీ ఆ హీరోయిన్ అంటే చంపేయాలని అంత కోపం కూడా ఉందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు మహానటి సావిత్రి. సావిత్రి గారు అంటే ఇష్టం లేనివారు ఉంటారా ..? చెప్పండి ప్రతి ఒక్కరికి ఆమె ఓ మహానటి . అయితే అలాంటి మహానటి అంటే బాలకృష్ణకు చాలా చాలా ఇష్టమట. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ సావిత్రి గార్ల కాంబోలో వచ్చిన ప్రతి సినిమాను ఇప్పటికీ లైక్ చేస్తూ టీవీలో చూస్తూ ఉంటారట బాలకృష్ణ .

 

కానీ ఎంతో తెలివిగల సావిత్రి జెమినీ గణేషన్ ను పెళ్లి చేసుకోవడం ..అది కూడా రెండో పెళ్లి చేసుకోవడం..తన జీవితాన్ని నాశనం చేసుకోవడం ఏమాత్రం నచ్చలేదట. అంతేకాదు చివరి రోజుల్లో ఆమె అనుభవించిన దీనస్థితి చూసి ఆయన కడుపు తరుక్కుపోయిందట . అంతేకాదు అసలు దీన్నంతటికి కారణం ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయమే అంటూ కూడా అప్పట్లో ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుంది . అయితే తనకు ఎంతో ఫేవరెట్ హీరోయిన్ గా ఉన్న సావిత్రి గారు లాస్ట్ రోజుల్లో అలాంటి దీనస్థితిలో చనిపోవడం చూసి బాలకృష్ణ గుండె తరుక్కుపోయిందట. చాలా బాధపడ్డారట . కానీ ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికీ ఫేవరెట్ హీరోయిన్ అంటే మాత్రం సావిత్రి గారు అని చెప్పుకొస్తూ ఉంటారు బాలయ్య..!!