సాయిపల్లవి-ప్రభాస్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..? రెబల్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవికి ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలోకి మలర్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులోకి ఫిదా అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది . రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే సూపర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది . అంతేకాదు ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ క్రియేట్ చేయించుకున్న సాయి పల్లవి .. ప్రెసెంట్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది .

మొదటినుంచి సినిమాల విషయంలో చాలా కఠినంగా ఉండే సాయి పల్లవి ఇప్పుడు మరింత స్థాయిలో కఠినంగా ప్రవర్తిస్తుంది . ఇలాంటి క్రమంలోనే తన వద్దకు వచ్చిన స్టార్ హీరో సినిమాలను సైతం రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి . కాగా ఇలాంటి క్రమంలోనే సాయి పల్లవి ప్రభాస్ సినిమా రిజెక్ట్ చేసిందన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే ఏ హీరోయిన్ అయినా రిజెక్ట్ చేస్తారా అంటూ మండిపడుతున్నారు రెబల్ ఫ్యాన్స్. సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమా ఏదో కాదు మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ .

ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ తెరవెనుక మాత్రం అన్ని పనులు చకచక పూర్తయిపోతున్నాయి . అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారట మారుతి . అయితే కథకు ప్రాధాన్యం లేని పాత్రలో సాయి పల్లవి నటించను అంటూ ముఖానే తెగేసి చెప్పుకొచ్చిందట . అంతేకాదు హీరో ప్రభాస్ అని తెలిసిన సరే ఏ మాత్రం కన్విన్స్ అవ్వలేదట సాయి పల్లవి . అఫ్ కోర్స్ భోలా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లిగా నటించడానికి ఒప్పుకొని సాయి పల్లవి ఇక కథ బాగా లేకపోతే ప్రభాస్ కి హీరోయిన్గా ఎలా నటిస్తుంది ..? అయినా మారుతి డైరెక్షన్ అంటే కచ్చితంగా నాటీసిన్స్ కంపల్సరీ ఉంటాయి. మరి సాయి పల్లవి ఎలా నటిస్తుందనుకుంటాడు మారుతి..? అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి క్రేజీ కాంబో కుదిరినట్టే కుదిరి లాస్ట్ మినిట్ లో మిస్ అయిపోయింది అంటూ తెగ బాధ పడిపోతున్నారు సాయి పల్లవి – ప్రభాస్ ఫ్యాన్స్ . అయితే మరి కొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు . ఆ నడిచే డిక్షనరీతో మనం వేగలేము రా బాబోయ్ మంచి పని చేసింది సినిమా రిజెక్ట్ చేసి అంటూ చెప్పుకొస్తున్నారు..!!