ఓటు చీలనివ్వం: పవన్..బీజేపీతో సాధ్యమేనా?

మరొకసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలనివ్వం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పలుమార్లు ఆయన వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనిచ్చే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చిన విశాయ్మ్ తెలిసిందే. అంటే ఆయన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఎలాగో బి‌జే‌పితో పొత్తులో ఉన్నారు. టి‌డి‌పితో కూడా కలిసి ముందుకెళ్తారనే ప్రచారం వస్తుంది.

కాకపోతే బి‌జే‌పికి ఈ మధ్య పవన్ దూరం జరుగుతూ వస్తున్నారు. దీంతో టి‌డి‌పితో పొత్తు ఫిక్స్ అని అంటున్నారు. కానీ ఇదే సమయంలో తాజాగా పవన్ ఢిల్లీకి వెళ్ళడం…అక్కడ కొందరు పెద్దలతో భేటీ కావడం, భేటీ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీసాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం బీజేపీతో గత రెండ్రోజులుగా కీలక చర్చలు జరిపినట్లు పవన్‌ వెల్లడించారు.

అలాగే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడంపై చర్చించామని.. ఇది జనసేన ఎజెండా మాత్రమే కాదు.. బీజేపీ ఎజెండా కూడా అని చెప్పుకొచ్చారు. అన్నిటిపైనా.. అన్ని కోణాల్లో చర్చించామని.. ఇవి సత్ఫలితాలిచ్చాయని.. అవి ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో తెలుస్తుందని తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తుల గురించి అడుగగా.. ఆ స్థాయి దాకా వెళ్లలేదని అన్నారు. ఏపీలో అధికారం సాధించడానికి అడుగులు వేస్తున్నామని చెప్పారు. అంటే బి‌జే‌పితో పొత్తు కొనసాగిస్తారా? లేక టి‌డి‌పితో కలుస్తారా? లేదా టి‌డి‌పి, బి‌జే‌పి, జనసేన కలుస్తాయా? అనే అంశంపై ఏ మాత్రం క్లారిటీ రాలేదు. కానీ పవన్ మాత్రం వ్యతిరేక ఓట్లని మాత్రం చీలనివ్వను అని అంటున్నారు.

అయితే ఒకటి బి‌జే‌పితో కలిసి పవన్ ముందుకెళితే ఖచ్చితంగా వ్యతిరేక ఓట్లు చీలుతాయి. టి‌డి‌పితో కలిస్తే మాత్రం ఓట్లు చీలవు. మరి చూడాలి రానున్న రోజుల్లో పొత్తుపై ఏం తేలుస్తారో.