జగన్ స్టిక్కర్లకు పవన్ బొమ్మతో కౌంటర్..కొత్త ట్రెండ్!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వైసీపీ రంగులు, జగన్ బొమ్మలే కనిపిస్తున్నాయనే చెప్పాలి. కనిపించిన ప్రతిదానికి వైసీపీ రంగు వేసుకుంటూ వచ్చారు. అలాగే ప్రతిచోటా జగన్ బొమ్మ ఉండేలా చూసుకున్నారు. ఆఖరికి రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల డాక్యుమెంట్లపై, పట్టాదార్ పాస్‌బుక్‌లపై కూడా జగన్ బొమ్మ వేశారు. ఇలా ప్రతి దానిపై జగన్ బొమ్మ కనిపిస్తూ వచ్చింది.

ఇప్పుడు ఏకంగా ప్రతి ఇంటికి జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్‌ని అంటిస్తూ వస్తున్నారు. అది కూడా జగనన్నే మా భవిష్యత్..మా నమ్మకం నువ్వే జగన్ అనే స్లోగన్ పెట్టి దానిపై జగన్ బొమ్మ ఉంటుంది. ఇక ఈ స్టిక్కర్లని ప్రతి ఇంటికి అంటించడమే లక్ష్యంగా వైసీపీ నేతలు, వాలంటీర్లు పనిచేస్తున్నారు. అయితే ఏపీలో ఉన్న ప్రతి కుటుంబం వైసీపీని అభిమానిస్తుందనుకుంటే పొరపాటే..ఎందుకంటే రాష్ట్రంలో టి‌డి‌పి, జనసేన ఇంకా ఇతర పార్టీలని అభిమానించే వారు ఉన్నారు. అలాగే పథకాలు అందని వారు ఉన్నారు..పథకాలు అందిన..పెరిగిన పన్నుల భారం పట్ల అసంతృప్తిగా ఉన్నవారు ఉన్నారు.

అలా చూసుకుంటే కొంతమేర వైసీపీని అభిమానించే వల్ల ఇంటికి జగన్ బొమ్మ ఉన్న స్టిక్కర్లు అంటిస్తే ఇబ్బంది లేదు..కానీ ప్రతి ఇంటికి అదే పనిగా స్టిక్కర్లు అంటించే పనిలో ఉన్నారు. దీంతో ఇప్పటికే వైసీపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నవారు..జగన్ స్టిక్కర్లని తీసేస్తున్నారు. అదే సమయంలో జగన్ స్టిక్కర్లకు నిరసనగా జనసేన కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది.

ఎక్కడైతే జగన్ స్టిక్కర్లు అంటించారో..అక్కడే మాకు నమ్మకం లేదు జగన్..మా నమ్మకం పవన్ అనే స్లోగన్ పెట్టి, పవన్ ఫోటోతో స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇలా రెండు పార్టీలు పోటాపోటిగా స్టిక్కర్లు అంటిస్తున్నారు. అసలు మన ఇళ్లకు వీళ్ళ స్టిక్కర్లు అనుకుని తిట్టుకునేవారు ఉన్నారు. మొత్తానికి ఏపీలో స్టిక్కర్ల రాజకీయం నడుస్తోంది.