ట్రెండీ టాక్.. పుష్ప -2 బాయ్ కాట్ నినాదం..?

ఇండస్ట్రీలో సినిమాల పైన బాయ్కాట్ అనే పదం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తూనే ఉంది.. ఏదో ఒక బ్యాచ్ ఎప్పుడు ఏదో ఒక సినిమా పైన ఇలాంటి బాయ్కాట్ అంటూ ప్రచారం చేస్తూనే ఉంటారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప -2 నుంచి చిత్ర బృందం ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో అమ్మవారి గెటప్ లో కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా కనిపించారు అల్లు అర్జున్.

Pushpa 2 The Rule first look: Allu Arjun is back as Pushpa to rule -  Hindustan Times
అయితే ఇప్పుడు దాని కారణంగా చూపిస్తూ బాలీవుడ్కు చెందిన ఒక ట్విట్టర్ పేజీ బాయ్కాట్ పుష్ప-2 అంటూ పలు ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ మధ్యనే వచ్చిన షారుక్ ఖాన్ చిత్రం పఠాన్ విషయంలో కూడా ఇలాంటి దుష్ప్రచారం జరిగింది.. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు.. ఇప్పుడు పుష్ప-2 సినిమానే టార్గెట్ చేస్తూ ఇలాంటి విషయాలు చేస్తున్నారు కొంతమంది క్రిటిక్స్. అమ్మవారి గెటప్ లో కనిపించిన అల్లు అర్జున్ చేతిలో గన్ను ఉండడాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు.. పుష్ప -2 సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది ఫ్రీలు పోస్టర్లు మాత్రమే విడుదలయింది అప్పుడే ఈ సినిమాని బాయ్కాట్ పుష్ప -2 అనే ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు.

అమ్మవారి రూపంలో కనిపిస్తే చేతిలో తుపాకి చూపించడాన్ని ఏమని నిరూపించాలనుకుంటున్నారు హిందూ మతం హింసను మాత్రమే ప్రోత్సహిస్తుందా అంటూ కామెంట్ చేస్తున్నారు.దీంతో పుష్ప వంటి అనైతిక వ్యక్తులకు మన దేవుడిగా భావిస్తున్నామా మన సంస్కృతిని అవమానించడం మానేయండి అంటూ బాలీవుడ్ లో నుంచి ఒక ట్విట్టర్ పేజీ వైరల్ గా మారుతోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ అభిమానులు మాత్రం వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.. అమ్మవారి ఆయుధం పట్టినట్టుగా పురాణాలలో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.