పవన్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రేణు దేశాయ్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ భార్య గా ఇమే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు నిత్యం ఏదో ఒక వాగ్వాదం రేణు దేశాయ్ తో చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఈ అభిమానం హద్దులు దాటుతూ ఉన్న సమయంలో రేణు దేశాయ్ సహనం కోల్పోయి వారికి గట్టి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.. నిన్నటి రోజున అకిరా నందన్ బర్తడే సందర్భంగా ఒక అభిమాని చేసిన కామెంట్స్ కి రేణు దేశాయ్ ఇలా స్పందించింది.. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం.

Happy Birthday Jr. Powerstar Akira Nandan | Pawan Kalyan - Renu Desai Son |  Filmy Hook - YouTube

నేటిజన్ ఇలా రాసుకుంటూ.. మేడం ఇది చాలా అన్యాయం మా అఖీరాను ఒకసారి అయినా చూపించండి.. మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది మాకు.. మీరు ఇలా హైడ్ చేయకండి..అప్పుడప్పుడు అయినా వీడియోలో అఖీరా బాబును చూపించండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ కామెంట్లు చూసిన తర్వాత రేణు దేశాయ్ చాలా మండినట్టుగా అనిపిస్తోంది.

మీ అన్న కొడుకు? .. అకిరా నా అబ్బాయి..మీరు ఒక తల్లికి పుట్టలేదా?.. మీరు ఆయనకు వీరాభిమానులని నేను అర్థం చేసుకుంటాను పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి ఇలాంటి మెసేజ్లను నేను అసలు పట్టించుకోవడం మానేశాను మీరు హద్దులు మీరు ఇలా మాట్లాడుతున్నారంటూ ఫ్యాన్స్ నిలదీయడం జరిగింది రేణు దేశాయ్.. ఈరోజు తన కొడుకు బర్త్డే సందర్భంగా ఇలాంటి కామెంట్లు చూడడం తనకు చాలా బాధగా ఉందంటూ ఎమోషనల్ అయింది. కాని చివరికి మాత్రం అకిరానందం బర్త్ డే సందర్భంగా ఒక వీడియోని షేర్ చేసింది.. షేర్ చేస్తూ తన కొడుక్కి 19 ఏళ్ళు వచ్చాయని చెబుతూ చెత్తంతా ఎదిగిన కూడా తల్లికి కొడుకే అని ఇంకా అకిర తన ఊర్లో సరిగ్గా సరిపోతున్నాడు అంటూ తన కొడుకు మీద ప్రేమతో వీడియోని షేర్ చేసింది.