14 ఏళ్ల క్రితం స‌మంత ఎలా ఉందో చూశారా.. వైర‌ల్‌గా మారిన త్రో బ్యాక్ పిక్‌!

సమంత.. తాజాగా సినీ ఇండస్ట్రీలో 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈమె నటించిన తొలి చిత్రం `ఏం మాయ చేసావే` విడుదలై నిన్నటితో 13 సంవత్సరాలు అవుతోంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సమంత.. ఆ తర్వాత ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరస అవకాశాలతో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది.

ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. 14 ఏళ్ల క్రితం దిగిన సమంత త్రో బ్యాక్‌ ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట‌ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ ను పంచుకున్నది మ‌రెవ‌రో కాదు.. సమంత స్నేహితుడు, ద‌ర్శ‌క‌న‌టుడు రాహుల్ రవీంద్రన్. సినీ ప‌రిశ్ర‌మ‌లో స‌మంత 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా రాహుల్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. దాదాపు 14 సంవత్సరాల క్రితం తన ఇంటి టెర్రస్ పై తన సోదరుడు రోహిత్ రవీంద్రన్ సమంతను ఫోటో తీసాడు. ఇన్నేళ్ల తర్వాత ఆ విషయాన్ని గుర్తుచేస్తూ ఆ ఫోటోను షేర్ చేసుకున్నాడు రాహుల్. దీంతో స‌మంత త్రో బ్యాక్ పిక్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారింది. 14 ఏళ్ల క్రితం స‌మంత ఎలా ఉంది.. ఇప్పుడు కూడా దాదాపు అలానే ఉంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Latest