అస‌లు ప్రాబ్ల‌మ్ మొత్తం టిల్లు గాడితోనేనా? అందుకే హీరోయిన్లు అలా చేస్తున్నారా?

ఈ ఏడాది విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి ఇందులో జంటగా నటించారు. విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలై మంచి విజయం సాధించింది. ఇక రీసెంట్గా `టిల్లు స్క్వేర్` టైటిల్ తో ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల‌ను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్‌ మీదకు వెళ్ల‌బోతుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో మొదటి నుంచి గందరగోళం కొనసాగుతూనే ఉంది. డీజే టిల్లు లో నేహా శెట్టి పాత్రకు ఎండ్ కార్డ్‌ పాడుతుంది. ఈ నేపథ్యంలోనే సీక్వెల్ లో మరో హీరోయిన్ ను ఎంపిక చేయాలని భావించారు. ఇందులో భాగంగానే మొద‌ట యంగ్ సెన్షేష‌న్ శ్రీ‌లీల‌ను ఎంపిక చేశారు. ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో అనుపమ పరమేశ్వర‌న్‌ ఎంట్రీ ఇచ్చింది. కారణం తెలియదు కానీ అనుపమ కూడా ఈ మూవీ నుంచి సైడ్ అయింది.

దాంతో మలయాళ భామ మడోన్నా సెబాస్టియన్ నో ఫైనల్ చేశారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ సైతం ఎగ్జిట్ అయిందట. అయితే ఇలా వరుసగా హీరోయిన్లు సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం సిద్ధు జొన్నలగడ్డనే అని ప్రచారం జరుగుతుం.ది అసలు ప్రాబ్లం మొత్తం టిల్లుగాడు తోనే అంటూ వార్త‌లు వస్తున్నాయి. ఈ సినిమాకు సిద్ధు హీరోగానే కాకుండా రైటర్ గా కూడా వర్క్ చేస్తున్నాడు. అయితే అంతా తనకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడని.. అతడి ప్రవర్తన హీరోయిన్లకు నచ్చకే సినిమా నుంచి తప్పుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.

Share post:

Latest