మహేష్ బాబుకి రామ్ చరణ్ ఫోబియా పట్టుకుందట… ఏ విషయంలో?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జీవితం ఆశాజనకంగా వున్నా వ్యక్తిగత జీవితం మాత్రం బాధాకరంగా ఉండటం చాలా బాధాకరణం. తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు కేవలం నెల వ్యవధిలోనే మరణించడం వలన మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అందుకనే మహేష్ బాబు సినిమాలకు గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ఇంటి సభ్యులతోనే గడుపుతున్నారు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇప్పటికే వాయిదా పడుతూ రావడం వల్ల మూవీ మేకర్స్ ఇబ్బంది పడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సినిమా నవంబర్లోనే స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. కానీ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసే టైం కి ఎప్పుడు ఏదో ఒక అవంతరం ఎదురు రావడం వలన వరుసగా మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమాని డిసెంబర్ 7న షూటింగ్ ప్రారంభించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గొల్లుమంటున్నాయి. ఈ విషయం పక్కన పెడితే తాజాగా మహేష్ బాబు సినిమాకి రామ్ చరణ్ భయం పట్టుకుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని గాసిప్స్ వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా సంగతి అందరికీ తెలిసినదే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్షాఫీస్ దగ్గర బోల్తాపడిన సంగతి విదితమే. అయితే మహేష్ బాబు కొత్త సినిమా కోసం త్రివిక్రమ్ వినయ విధేయ రామ సినిమా సెట్ నే వాడుతున్నారు అని టాక్ నడుస్తోంది. ఆ సెట్ హైదరాబాద్ శివారులోని ఖాన్ పూర్ లో వేశారు. అయితే ఆ సినిమా సెట్ ఇప్పటికి కూడా అలాగే ఉండడంతో ప్రస్తుతం దాన్నే త్రివిక్రమ్ వాడుకోనున్నారని టాక్. అయితే సదరు సినిమా ప్లాప్ అవడంతో దానికి సంబంధం వున్న సెట్ ఎందుకు? అని మహేష్ ఫీల్ అవుతున్నదని గుసగుసలు వినబడుతున్నాయి.

Share post:

Latest