హైపర్ ఆది గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, చీమకుర్తి లో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆది అసలు పేరు మీకు తెలుసా? అతని అసలు పేరు కోట ఆదయ్య. హైపర్ ఆది బి.టెక్ పూర్తి చేశాక కొంతకాలం సాప్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసాడు. తరువాత ఉద్యోగంలో ఇమడలేక నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆ తరువాత జబర్దస్త్ షో లో అవకాశం రాగా స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసి, అదిరే అభి టీంలో నటుడిగా పరిచయమై, జబర్దస్త్ లో టీమ్‌కు లీడర్‌గా ఎదిగాడు.
ఆ తరువాత సినిమాలలో అవకాశం వచ్చాక ఆ షోని విడిచిపెట్టాడు. అయితే ప్రస్తుతం అనేక టీవీ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. ఇకపోతే ఇటీవల కాలంలో చాలామంది హీరోలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం బుల్లితెరపై కనబడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే బాగా పాపులారిటీ వున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలకు చిత్ర బృందం ప్రత్యేకంగా హాజరయ్యి.. తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రవితేజ ధమాకా సినిమా గురించి ఓ షోకి వచ్చారు.
ప్రముఖ బుల్లితెర షో అయినటువంటి ఢీ ఫైనల్స్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు రవితేజ. ఈ క్రమంలోనే తనదైన పంచు డైలాగ్ లతో హైపర్ ఆదికి ఫ్యూజులు ఎగిరిపోయేలా పంచ్ లు విసిరాడు. అవును, ఢీ సీజన్ 14 ఫినాలే కి గెస్ట్ గా వచ్చిన రవితేజ ఈ షోలో ఉన్న హైపర్ ఆదితో కాస్త సరదాగా మాటల తూటాలు పేల్చాడు. మొదట ఆది మాట్లాడుతూ.. “మిమ్మల్ని కలిస్తే చాలు అనుకున్న నాకు మీ సినిమాలో అవకాశం ఇచ్చారు” అని అనగా “నీతో చేయాలనీ నేను కూడా వేచి చూసాను” అని అంటూ జబర్దస్త్ షో నటుడివి కదా నీకు ఈ ఢీ షో కి సంబంధం ఏంటి? అంటూ చవాకులు పేల్చాడు రవితేజ.