టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ప్రస్తుతం థమన్ మంచి మంచి ఆఫర్లతో ఊపిరి సలపనంత బిజీగా వున్నాడు. ఇక స్టార్ హీరోలు కొత్తగా ఏ ప్రాజెక్ట్ ను ప్రకటించినా ఆ సినిమాకు థమన్ ను మ్యూజిక్ కావలసిందే అని పట్టుబడటంతో నిర్మాతలు కూడా యేమి చేయలేకపోతున్నారు. ఓ 4 సంవత్సరాల క్రితం వరకు మంచి స్పీడుని కొనసాగించిన దేవి శ్రీ ప్రసాద్ థమన్ రాకతో కాస్త స్లో అయ్యాడు అంటే అర్ధం చేసుకోండి… థమన్ ఎంత బిజీగా వున్నాడో.
ఇక ఒకప్పటి టాలీవుడ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ శిష్యుడు థమన్ అని ఎంతమందికి తెలుసు. అయితే నేడు ఈ శిష్యుడు గురువునే మించి పోయాడు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా మణిశర్మ ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ థమన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మణిశర్మ మాట్లాడుతూ… “థమన్ ఇప్పుడు జంటిల్మెన్ అయిపోయాడు కానీ, నాదగ్గర కీ బోర్డు ప్లే చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆకతాయిగా ఉండేవాడు. చెప్పిన మాట వినేవాడు కాదు. దాంతో నేను చేతికి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతో కొట్టేవాడిని. ఐతే నా దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ చాలా ఉత్తముడు” అని అన్నారు.
కాగా ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థమన్ మణిశర్మ దగ్గర కీ బోర్డ్ ప్లేయర్ గా పనిచేసేవాడని ఎంతమందికి తెలుసు? బేసిగ్గా మణిశర్మకి చాలా కోపం ఎక్కువ. ఓ రకంగా అది పనిమీద బాధ్యత అని అనుకోవాలి. ట్యూన్స్ చేసే క్రమంలో బీజీఎం కూడా చేయడం కత్తిమీద సాము లాంటిది. ఆ విషయంలో మణిశర్మ చాలా సీరియస్ గా ఉండేవారు. దాంతో థమన్ చేసిన పనుల వల్ల కోపం వస్తే చేతికి ఏది దొరికితే దానితో థమన్ ను కొట్టేవాడినని ఆయన వెల్లడించారు.