పొడుగుకాళ్ల తెలుగు సినిమా సుందరి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక దాంతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరితో నటించి, మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
ఇక కొన్నాళ్లుగా టాలీవుడ్లో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ ఎదురు చూడక టాలీవుడ్ బాట పట్టింది ఈ అమ్మడు. అక్కడ ఆమె టైం బావుంది. వరుస అవకాశాలు ఆమెకి వచ్చాయి. అయితే అక్కడ పలువురు స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో కాస్త డేర్ స్టెప్ తీసుకొని బోల్డ్ కంటెంట్ తో ఇపుడు అక్కడ ఓ సినిమా చేయబోతోంది. కాగా ఈ సినిమా తాలూకా పోస్టర్ ఒకటి తాజాగా రిలీజు కాగా అది చూసి రకుల్ అభిమానుల ఆత్మాభిమానం దెబ్బతింది.
అవును, రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం చత్రివాలి అనే ఒక బోల్డ్ హిందీ సినిమాలో నటించింది. ఆ సినిమాలో కూడా ఒక అభ్యంతరమైన పాత్రలో నటించినట్టు విశ్వనీయవర్గాల సమాచారం. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రోని స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమా జీ5 లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. అయితే పోస్టర్ చుసిన రకుల్ అభిమానులు సరైన అవకాశాలు లేకపోవడంతో ఇలాంటి అభ్యంతర బోల్డ్ పాత్రలు చేయడానికి ఒప్పుకుంటున్నావా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.