దుప్పట్లో దూరి అలా ఊసులు చెబుతున్న యాంకర్ అనసూయ.. ఛి అదేం పాడుపని?

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి ఈ తరం కుర్రకారుకి చెప్పాల్సిన పనిలేదు. `జబర్దస్త్`తో విశేషమైన ప్రజాదరణ పొందిన అనసూయ ఆనతికాలంలోనే సినిమాల్లోకి కూడా వెళ్ళిపోయింది. బేసిగ్గా తెలివైన అమ్మాయి కనుక సినిమా కధల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఓ వైపు బుల్లితెరపై షోలు చేస్తూ, మరోవైపు సినిమాలు చేస్తూ, ఇంకోవైపు సోషల్ మీడియాలో తన అందాన్ని షోకేస్ చేస్తూ అభిమానులను పలువిధాలుగా అలరిస్తోందనే చెప్పుకోవాలి.

తాజాగా అనసూయ తాజాగా బెడ్‌పై పడుకున్న ఓ రొమాంటిక్ ఫోటోని షేర్‌ చేసింది. ఇక ఆ ఫోటోని చూసిన కుర్రకారు గుండెలు మోకాల్లోకి జారాయి అంటే నమ్మండి. బ్లాక్‌ టీషర్ట్ ధరించి, బ్లూ బెడ్‌ షీట్‌ కప్పుకుని చిలిపి నవ్వులు నవ్వుతూ కవ్విస్తోంది అనసూయ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ ఫోటోతోపాటు అనసూయ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ కూడా పెట్టిందండోయ్. దుప్పటి కప్పుకుని పగటి కలలు కంటున్నట్టు పేర్కొంది. `కలలను వదిలేసుకోవద్దు, నిద్రపోతూ ఉండండి` అని పోస్ట్ పెట్టింది.

దీంతో నెటిజన్లు హాట్‌ కామెంట్లలతో తమదైన రీతిలో రెచ్చిపోతున్నారు. బెడ్‌పై మీరు అలా పడుకుంటే కుర్రాళ్ల పరిస్థితి ఏంగాను, నెటిజన్లని రెచ్చగొట్టడం కాకపోతే ఏమిటి ఈ రచ్చ అని ఒకరు కామెంట్ చేస్తే, ఛి చిలిపి… ఏమిటది… మా గతం మాకు గురుతు చెయ్యకు అని మరొకరు, ఓ వయ్యారి భామ… నీ అందానికి ఓ దండం… మమ్మల్ని ఇలా చిత్రవధ చెయ్యకు సుమా! అని ఇంకొకరు….. ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వీలైతే ఆ పోస్టు చూసి తరించండి.