విజయవాడ సెంట్రల్‌ వైసీపీలో పోరు..మల్లాదికి రివర్స్.!

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలకు, ఇతర నేతలకు పడటం లేదు. ఇలా నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతుంది. ఇదే క్రమంలో కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లు పోరు జరుగుతుంది.

ప్రొద్దుటూరు, గురజాల లాంటి స్థానాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వార్ నడుస్తోంది. ఇదే పోరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మొదలైంది. ఇక్కడ ఎమ్మెల్యీ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహూల్ల మధ్న్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్సీగా కరీమున్నీసా ఉన్నంత కాలం ఎలాంటి రచ్చ లేదు. ఆమె చనిపోయాక..వారసుడైన రుహూల్లకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇక ఇక్కడ నుంచే రచ్చ మొదలైంది. సాధారణంగా ప్రోటోకాల్‌లో ఎమ్మెల్యేకు ధీటుగా ఎమ్మెల్సీకు గౌరవం ఇవ్వాలి.

అయితే సెంట్రల్ స్థానంలో జరిగే కార్యక్రమాల్లో మల్లాదితో పాటు రుహూల్లకు గౌరవం దక్కుతుంది. ఈ అంశం మల్లాదికి నచ్చడంలేదు. దీంతో మల్లాది..నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్సీని  ఆహ్వానించడం లేదు. దీంతో ఎమ్మెల్సీ కూడా రివర్స్ అయ్యారు..ఆయన కూడా ఎమ్మెల్యే లేకుండా సెపరేట్ గా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో వైసీపీలోనే మల్లాదికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలని ఎమ్మెల్సీ తనవైపుకు తిప్పుకుంటున్నారు. అయితే సెంట్రల్‌లో మల్లాది..పార్టీలో ఉన్నవారి కంటే..ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు ఇవ్వడం, ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

అలా అసంతృప్తిగా ఉన్న నేతలని రుహూల్ల తనవైపుకు తిప్పుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆధిపత్య పోరు పెరిగిపోయింది. ఈ పోరు ఇలాగే కొనసాగితే వైసీపీకి డ్యామేజ్ తప్పదు. మల్లాదికి మళ్ళీ సీటు ఇస్తే..రుహూల్ల వర్గం సహకరించే పరిస్తితి ఉండదు. కాబట్టి మల్లాదికే రిస్క్ ఎక్కువ.