ఆ ముగ్గురు హీరోయిన్లు ఎన్టీఆర్ లైఫ్‌లో సో స్పెషల్ .. ఎందుకంటే..!

నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాలలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలకృష్ణ తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరో ఎన్టీఆర్. ఇక ఈ బాబాయి- అబ్బాయి టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీయలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని కరోనా తర్వాత టాలీవుడ్‌కు మార్గదర్శకుడిగా మారాడు.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ క్రేజ్ అమాంతం పెరిగింది.. ఇటు సినిమాలు మరో పక్క అహలో అన్‌స్టాపబుల్ టాక్‌ షో కు వ్యాఖ్యాతిగా వ్యవహరిస్తూ తనలోని కొత్త బాలకృష్ణను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఇప్పటి తరం యువతలోనూ తన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇటు అబ్బాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన ఇమేజ్‌ను పెంచుకుని వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం తన 30వ సినిమాని స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా పాన్ ఇండియా దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్‌తో తన 31వ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ తండ్రి -కొడుకుల‌కు సంబంధించిన రెండు సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ 2001లో ‘నరసింహ నాయుడు’ సినిమాతో ఇండస్ట్రీ హీట్ అందుకున్నాడు.. ఆ సినిమాలో బాలయ్యకు జోడిగా సిమ్రాన్ నటించగా సెకండ్ హీరోయిన్ గా ప్రీతి జింగానియా.. బాలయ్య మరదలుగా ఆశా షైనీ నటించారు.

ఇక తర్వాత బాలకృష్ణ – పి.వాసు కాంబినేషన్లో వచ్చిన మహారధి సినిమాలో స్నేహ మరియు మీరాజాస్మిన్ హీరోయిన్‌గా నటించారు. నవనీత్ కౌర్ ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాటలో పాటు డాన్స్ ప్రాక్టీస్ చేసే సన్నివేశంలో కూడా కనిపిస్తుంది. తర్వాత బాలకృష్ణ – దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన పాండురంగడు సినిమాలో బాలకృష్ణకు జోడిగా స్నేహ నటించగా, ఆ సినిమాలు రుక్మిణి గా అర్చన, టబు ఓ కీలకపాత్రలో నటించారు. తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన లయన్ సినిమాలో కూడా అర్చన ఓ ప్రత్యేక పాటలో కనిపిస్తుంది.

ఎన్టీఆర్ – రాజమౌళి కాంబోలో వచ్చిన మూడో సినిమా యమదొంగ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా ప్రియమణి నటించింది. నాగ సినిమాలో ‘నాయుడోరీ పిల్ల’ పాట తర్వాత మళ్లీ రంభ యమదొంగ సినిమాలో ‘నాచోరే’పాటలో ఎన్టీఆర్ తో కలిసి నటించింది. అయితే ఈ సినిమాలో ప్రీతి జింగానియా, నవనీత్ కౌర్, అర్చన ఈ ముగ్గురు భామలతో ఎన్టీఆర్ యమలోకంలో ఓ అదిరిపోయే పాటలో ఈ ముగ్గురు రంభ, ఊర్వశి, మేనకలుగా యంగ్ యముడుతో ఆడి పాడారు.

అదే పాటలో ఎన్టీఆర్ తాత బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ కూడా కనిపించి నందమూరి అభిమానులను అలరించాడు. ఈ పాటల తాత మనవడు ఈ ముగ్గురితో కలిసి చేసిన‌ స్టెప్పులు ప్రేక్షకులకు విజిల్స్ రప్పిస్తాయి. ఈ ముగ్గురు ఎన్టీఆర్ తో స్టెప్పులు వేయటానికి బాగానే కష్టపడ్డారు. అలా ఈ ముగ్గురు అటు బాబాయ్ సినిమాల్లో నటించన ఈ ముగ్గురు హీరోయిన్లతో ఇటు అబ్బాయి ఓకే సాంగ్ తో సూపర్ హిట్ కొట్టాడు. ఇలా ఇది ఎన్టీఆర్ సినిమాల్లో స్పెషల్ మెమరీగా మిగిలిపోయింది.