సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు.. ఈ మధ్యకాలంలో ఏ విషయాన్ని ఓపెన్ గా చెప్పట్లేదు . పచ్చిగా ఫోటోషూట్స్ చేసే స్టార్ హీరోయిన్స్ ..తమ అవకాశాల విషయంలో మాత్రం పరోక్షకంగా కామెంట్ చేస్తూ.. తమకు ఆ హీరోతో నటించాలని ఉంది అని చెప్తూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలామంది హీరోస్, హీరోయిన్స్ అలాంటి స్ట్రాటజీని ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు .
ఈ క్రమంలోనే అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది స్టార్ డాటర్ అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటనలో అమ్మను మించిపోయి నటించి సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది . ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటివరకు జాన్వి కపూర్ నటించిన సినిమాలు ఏవి బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు . అయిన కానీ ఆమెను స్టార్ హీరోయిన్గా చూస్తున్నారు బాలీవుడ్ జనాలు . అంతలా తన అమ్మ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో నెట్టుకు వస్తుంది.
కాగా రీసెంట్గా హైదరాబాద్లో ఫ్యాషన్ షోకి అటెండ్ అయినా జాన్వి కపూర్.. అక్కడ మీడియాతో కాసేపు చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో భాగంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారింది . అక్కడ విలేకరులు జాన్వీకాపూర్ ని ..” టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు అడగ పెట్టబోతున్నారు” అని ప్రశ్నించగా .
ఆమె ఆన్సర్ ఇస్తూ ..”ఎస్ నేను కూడా దానికోసమే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా..నా ఈ కోరిక తొందరగా నెరవేరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది. అంటే జాన్వీ కపూర్ తెలుగులో నటించడానికి రెడీగా ఉంది . ఆమెకు ఆ స్థాయి అవకాశాలు ఇవ్వండి అంటూ ఇన్ డైరెక్ట్ గా డైరెక్టర్స్ కి జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. మరి చూడాలి జాన్వికపూర్ ఇన్ డైరెక్ట్ కామెంట్స్ ని అర్థం చేసుకున్న ఏ డైరెక్టర్ ఆమెను డైరెక్ట్ గా అప్రోచ్ చేయి అవకాశం ఇస్తాడో. ఏది ఏమైనా సరే జాన్వి కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తే మాత్రం శ్రీదేవి అభిమానులు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అన్నది మాత్రం వాస్తవం..!!