ఈ రోజుల్లో మీమ్స్ అనేవి సోషల్ మీడియాలో ఎంత ప్రభావం చూపిస్తున్నాయో అందరికీ తెలిసినదే. ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో మాత్రమే నడిచిన ఈ ట్రెండ్ ఇపుడు అంతటా సాగుతోంది. ఇండియా విషయానికొస్తే మీమ్స్ ఇక్కడ రాజకీయ, సినిమా పరిస్థితులను బాగా విశ్లేషించి చెబుతున్నాయి. అందుకే కొంతమంది డబ్బులిచ్చి మరీ మీమర్స్ ని పెట్టుకుంటున్న పరిస్థితి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై ఫన్నీ మీమ్స్ చేసి వదులుతున్నారు ఔత్సాహికులు. ఈ వీకెండ్ లో బాగా వైరల్ అవుతున్న చాలామందిని ఆకట్టుకుంటున్న మీమ్స్ పై ఓ లుక్కేయండి.
ఈ రోజుల్లో అరేంజ్డ్ మేరేజ్ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పెళ్ళి కొడుక్కి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం, సొంత ఇల్లు ఉంటేనే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. లేదంటే డేకడం లేదు. సాధారణ మగవారికి నేడు పెళ్లిళ్లు కానీ పరిస్థితి నెలకొంది. ఈ సిట్యుయేషన్ పై నాగార్జున, బ్రహ్మానందం స్టిల్‌తో నవ్వించే ఒక మీమ్ క్రియేట్ చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. ఈ పరిస్థితులలో అందరి సిట్యుయేషన్ తెలిపేలా ఫన్నీగా రావు రమేష్, అనుపమ పరమేశ్వరన్‌లతో మీమ్ చేశారు.
అలాగే తెలంగాణలో పానీపూరీ వల్ల టైఫాయిడ్ కేసులు వస్తున్న విషయం గెలిసినదే. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ఒక మీమ్ వచ్చింది. అలాగే చలికాలంలో బైక్ స్టార్ట్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్ అయిపోతుంది. దీనిపై కూడా వేణుమాధవ్ ఫన్నీ స్టిల్‌తో భలేగా మీమ్ క్రియేట్ చేశారు. అలాగే ఆరెంజ్ మూవీతో నాగబాబు దివాలా తీసిన విషయం తెలిసిందే. ఈ మూవీ రీసెంట్ గా 10 ఏళ్లు పూర్తిచేసుకుంది. అయితే అప్పటి ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చేసింది. దీన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తే హిట్ చేస్తామని ప్రేక్షకులు అంటున్నారు.