సౌత్ సినిమా ఇండస్ట్రీలో అన్నయ్యలు మెగాస్టార్లయితే వాళ్ళను తలదన్నేలా ఎదిగిన తమ్ముళ్లు వీళ్ళే!

మన సౌత్ సినిమా పరిశ్రమలోని స్టార్లకు కొదువ లేదు. అందులో మాస్ ఇమేజ్ వున్నవారు ఏ కొద్దిమందో వుంటారు. సరిగ్గా అలాంటి ఇమేజ్ వేరొకరు సంపాదించడం అనేది అంత సులువు కాదు. అయితే అదే ఫ్యామిలీకి చెందిన వారు కూడా ఫెయిల్ అయినవారు చాలామంది వుంటారు. ఎందుకంటే నటనని వారసత్వంగా పుచ్చుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ విషయంలో ముగ్గురు మాత్రం అన్నయ్యలకంటే కూడా ధీటుగా దూసుకుపోతున్నారు. ఇపుడు ఆ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం.

ముందుగా మన తెలుగు పరిశ్రమ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం అతనికున్న క్రేజ్ ముందు ఎవరన్నా దిగదుడుపే. అలాంటి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎలా ఎదిగారో మీకు తెలియంది కాదు. మెగా ఇమేజ్ తో లాంచ్ అయినా అటుపై అన్నయ్య ప్రభావం తనపై పడకుండా ఎంతో జాగ్రత్తగా కెరీర్ ని మలుచుకున్నారు. తెలుగు రాష్ర్టాల్లో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదిం చుకున్నారు. ఇక పవన్ నటుడిగా కంటే వ్యక్తిగతంగా అభిమానులకు బాగా దగ్గరయ్యారు అన్నది వాస్తవం.

సరిగ్గా అదేమాదిరి కన్నడ పరిశ్రమలో జరిగింది. కన్నడలో ఇక్కడ పవర్ స్టార్ స్థాయి మాదిరి ఆదరణకు నోచుకున్న నటుడు పునీత్ రాజ్ కుమార్. కన్నడలో రాజ్ కుమార్ వారసుడిగా… శివరాజ్ కుమార్ సోదరుడిగా ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ తన తండ్రి, సోదరుల షాడో బయటకు వచ్చి తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. యితడు కూడా నటుడిగా కంటే మానవతా హృదయంగల గొప్ప మనిషిగా నీరాజనాలు అందుకున్నారు. అదేమాదిరి కోలీవుడ్ లోనూ ఇలాంటి బ్రదర్ ఒకరున్నారు. అతను మరెవ్వరో కాదు, హీరో సూర్య తమ్ముడు కార్తీ. ఇతను కూడా తమిళ పరిశ్రమలో తనకంటూ ఓ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు.