టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు 30 నిమిషాలకు కాంటినెంటల్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. తన అధ్బుతమైన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న కృష్ణ ఇక ఇకలేరు అనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా ఆయన కొడుకు మహేష్ బాబు ను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆయన పార్ధివ దేహం వద్ద నాన్న ను చూస్తూ వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ క్రమంలోనే కృష్ణ తో ఉన్న ఫ్రెండ్షిప్ ను బయటపెడుతున్నారు సినీ స్టార్స్ . రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మరణానికి చింతిస్తున్నామంటూ తెలియజేస్తున్నారు. కాగా రేపు సాయంత్రం తెలంగాణ ప్రభుత్వ అధికారుల లాంచనాలతో కృష్ణ అంతక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది . కాగా కృష్ణ మరణానికి చింతిస్తూ సినీమండలి రేపు షూటింగ్ లకి బంద్ ప్రకటించింది. రేపు కృష్ణ గారి అంత్యక్రియలు చేయనున్న నేపథ్యంలో రేపే షూటింగ్‌లకు బంద్ కి పిలుపునిస్తూ తెలుగు నిర్మాత మండలి నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు గౌరవ కార్యదర్శలు టి ప్రసన్నకుమార్, మోహన్ అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేశారు . అంతేకాదు రేపు ఉదయం ఏపీలో మార్నింగ్ షో లు కూడా రద్దు చేశారు ఎగ్జిబిటర్లు. అంతవరకు బాగానే ఉంది .అయితే ఈ నిర్ణయం ఇప్పుడు రెబెల్ ఫాన్స్ కు కోపం తెప్పిస్తుంది. ఎందుకంటే అంతకుముందు రీసెంట్ గానే రెబల్ హీరో కృష్ణం రాజు మరణించారు . అయితే ఆ టైంలో సినీమండలి ఏ షూటింగ్‌ను వాయిదా వేయలేదు ..రద్దు చేయలేదు. ప్రగాఢ సంతాపం తెలిపింది .. ప్రభుత్వాలు లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారే.. కానీ ఇలా ఆయన మరణానికి షూటింగ్స్ బంద్ చేయించలేదు. ఆ టైంలో ఆర్జీవి సైతం ఫైర్ అయ్యారు.
కానీ ఇప్పుడు కృష్ణ విషయంకు వచ్చేసరికి షూటింగ్ లు బంద్ చేయిస్తున్నారు. దీంతో ఒకసారి రెబెల్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు . కృష్ణంరాజుకులేని కొత్త రూల్ కృష్ణకు ఎలా వచ్చింది ..?అంటూ మండిపడుతున్నారు . ఏది ఏమైనా సరే సినీ ఇండస్ట్రీ అంటే అందరిని ఒకటే లాగా చూడాలి.. కళామతల్లి బిడ్డలు అందరూ ఒకటే ఇలా వ్యత్యాసాలు చూపించడం ఎంతవరకు న్యాయమంటూ మండిపడుతున్నారు. మరి దీనికి సమాధానం ఎవరిస్తారు..? చూద్దాం ఎవరు ఇస్తారో..!!