బాలయ్యకు షాక్ ఇచ్చిన జయమ్మ.. కారణం ఏంటంటే..?

జయమ్మ అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె నటిగా తనదైన మార్క్ చూపించింది. తమిళంలో శింబు హీరోగా పోడా పోడి సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూ టర్న్ తీసుకొని విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా రాణిస్తోంది. తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ మూవీతో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తన తదుపరి పాత్రల తో మరింత పేరును తీసుకొచ్చింది. అంతేకాదు గత ఏడాది వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రవితేజ క్రాక్ సినిమాలో కూడా నటించింది. అలాగే అల్లరి నరేష్ నాంది సినిమాలో కూడా తనదైన పాత్రలో మరింత మెప్పించింది వరలక్ష్మి శరత్ కుమార్. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో క్రేజ్ స్టార్ల మూవీస్ లో ప్రత్యేక ఆఫర్లను దక్కించుకొని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీబిజీగా గడిపేస్తోంది.

Varalaxmi Sarathkumar in Balakrishna film?
ఇప్పుడు సమంతతో యశోద , తేజ సజ్జా తో హనుమాన్, నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డి వంటి సినిమాలలో కూడా నటిస్తోంది. బాలయ్య సినిమాలో బాలయ్యకు ధీటుగా నిలబడే పద్మ గా కనిపించబోతోంది వరలక్ష్మి. ఈ సినిమాలో తన పాత్ర చాలా హైలెట్ గా ఉండబోతుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఆలోచిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ వారు నిర్మిస్తున్నారు. కీలక ఘట్టాల చిత్రీకరణకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే బాలయ్య – వరలక్ష్మీ షూటింగ్లో పాల్గొనగా ఒక కీలక ఘట్టాన్ని చిత్రీకరించారు.

ఇదిలా ఉండగా ఈ సీన్లో ఐదు పేజీల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పి బాలయ్యనే షాక్ కి గురి చేసిందట వరలక్ష్మి. బాలయ్య కాంబినేషన్లో సీన్ కావడంతో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సీన్ చేయడం అంత ఈజీ కాదు అని అంతా భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ సింగిల్ టేక్ లో ఐదు పేజీల డైలాగ్ లు పూర్తి చేయడంతో బాలయ్యతో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవ్వక్కయ్యారంట. అంతేకాదు సినిమాలో ఈ సీనే ప్రధాన హైలైట్ గా నిలవనుందని కూడా తెలుస్తోంది. ఎట్టకేలకు వరలక్ష్మీ రంగంలోకి దిగింది కాబట్టి పక్క ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Share post:

Latest