సిద్ధార్థ్-అదితి రిలేషన్ నిజమే.. కానీ నాకు తెలియదు.. శర్వా సంచలన వ్యాఖ్యలు!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ `అన్ స్టాపబుల్` అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో సీజన్ 1 మంచి విజయం అందుకోవడంతో ఇటీవల సీజన్ 2 లోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ షో కి గెస్ట్లుగా యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేష్ లు పాల్గొని బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు. ఈ షోలో పాల్గొన్న ఈ హీరోలు ఇద్దరు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తాజాగా హీరో సిద్ధార్థ్ మరియు హీరోయిన్ అదితి రావు హైదరి ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఈ షోలో శర్వానంద్ స్పందించాడు. ఈ క్రమంలోనే బాలయ్య మీరు సాధారణంగా హీరోయిన్లను ఎలా సెలెక్ట్ చేసుకుంటారని ప్రశ్నించుగా..? దానికి శర్వానంద్ బదులీస్తూ అంతా డైరెక్ట్ గారు చెప్పింది చేయడమే తప్ప.. నేను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసేది ఏమీ లేదంటూ బదులిచ్చాడు. అయితే మరి అదితీ రావు సంగతేంటి అని బాలయ్య అడగగా.. ఆమె మహాసముద్రంలో సిద్ధార్థ్ సరసన హీరోయిన్గా నటించిన కానీ నాకు జంటగా కాదు అని చెప్పాడు.

వెంటనే దానికి బాలయ్య నిజ జీవితంలో కూడా సిద్ధార్థ్ కు జోడిగా మారిందా? అని శర్వానంద్ ని అడగగా.. శర్వానంద్ స్పందిస్తూ.. అదేం నాకు తెలియదు.. కానీ బయట తన చుట్టూ సిద్ధార్థ్ తిరుగుతున్నాడు అంటూ.. తాజాగా సోషల్ మీడియాలో స్వీట్ హార్ట్ అంటూ ఓ పిక్ షేర్ చేశాడంటూ అది కూడా నాకు అర్థం కాలేదు అని శర్వానంద్ తెలివిగా తప్పించుకున్నాడు. సిద్ధార్థ అదితి రిలేషన్ నిజమేనంటూ పైగా తనకు తెలియదంటూ శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

అయితే శర్వానంద్, సిద్ధార్థ్ మరియు అదితి రావు హైదరి కలిసి `మహాసముద్రం` సినిమా చేశారు. అయితే సిద్ధార్థ్ అదితిరావు జంటగా చక్కర్లు కొట్టడం, ఈవెంట్ కు కలిసి హాజరవ్వడంతో వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు అయినప్పటికీ కూడా తమ డేటింగ్ రూమర్స్ పై ఈ జంట ఇప్పటికీ స్పందించలేదు.