సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ లీక్… అతని జీవితంలో శృంగారం, డ్రామా, బాధ చాలానే వున్నాయి?

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినిమా ఇండస్ట్రీ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. డేరింగ్ అండ్ డాషింగ్ నటుడిగా పిలవబడే ఈ సూపర్ స్టార్ మరణాన్ని ముఖ్యంగా ఘట్టమనేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక లెజెండరీ సెలబ్రిటీ కాలం చేసిన ప్రతిసారీ వారి బయోపిక్ తీయడం గురించి సహజంగానే చర్చలు జరుగుతుంటాయి. ఇప్పటికే అనేకమంది స్టార్ల జీవిత చరిత్రలను బియోపిక్స్ గా వెండి తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు దివంగత కృష్ణ బయోపిక్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది.

ఈ క్రమంలో అనేక విషయాలు గురించి సినిమా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. కృష్ణ నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువుగా మారారు. అతని గట్స్ తన కొడుకు అయినటువంటి మహేష్ బాబుకి కూడా ఉండమంటే నమ్మశక్యం కాదేమో. ఎందుకంటే మహేష్ బాబు కేవలం సినిమాలవరకే పరిమితం అయ్యారు. రిస్క్ చేయడంలో మాత్రం కృష్ణ రెబెల్ అని చెప్పుకోవాలి. ఒక్క సినీ రంగంలోనే కాకుండా ఎంపీగా కూడా గెలిచి రాజకీయాలలోనూ కృష్ణ కీలక పాత్ర పోషించారు.

సినిమా హీరో, నిర్మాతల హీరో, సొంతంగా బ్యానర్, ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీలను పరిచయం చేయడం, పద్మాలయ స్టూడియో నిర్మాణం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం, విజయ నిర్మలతో రెండో పెళ్లి, తన కుమారుడు మహేశ్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టడం వరకు కృష్ణ లైఫ్ లో ఎన్నో రకాల విశేషాలు సంతరించుకున్నాయి. ఇవన్నీ ఒక బయోపిక్ లేదా వెబ్ సిరీస్ తీయడానికి సరిపోతాయి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎవరి జీవితాన్నైనా తెర మీదకు బయోపిక్ గా తీసుకురావాలంటే.. ఇంతకంటే ఏం కావాలి. అలా ఎదిగే క్రమంలో అనేక ఆటుపోట్లు చవిచూసే ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest