వావ్.. ఇది నిజంగా వంటలక్క అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఎందుకంటే వంటలు అక్కను బుల్లితెరపై కాకుండా వెండితెరపై చూడాలి అంటూ ఆమెను ఇష్టపడే జనాలు ..ఆమె ఫ్యాన్స్ అందరు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే తెరపై పలు సినిమాల్లో చిన్నచితక పాత్రల్లో కనిపించిన చెప్పుకోదగ్గ హీరో సినిమాలో నటించలేదు. దీంతో ఆమె వెండి తెర ఎంట్రీ FLOP అయ్యింది. అయితే ఇప్పుడు ఆమె ఖాతాలో బంపర్ ఆఫర్ పడినట్లు తెలుస్తుంది .
ఏకంగా అక్కినేని హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. నాగచైతన్య 22 సినిమాలో నటించే అవకాశం అందుకునింది మన వంటలక్క. దీనికి సంబంధించిన న్యూస్ కొద్దిసేపటి క్రితమే చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మనకు తెలిసిందే పేరుకు మలయాళ బ్యూటీ అయిన ఈ ప్రేమీ విశ్వనాథన్ కార్తీకదీపం అనే సీరియల్ ద్వారా హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . పక్కాగా చెప్పాలంటే ఓ స్టార్ హీరోయిన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు ప్రేమి విశ్వనాథన్ కి కూడా ఉంది. తన ఒరిగినల్ పేరు కంటే వంటలక్క గానే గుర్తు పెట్టుకున్నారు జనాలు. అంతలా సీరియల్ లో తన పాత్ర ద్వారా జనాల మైండ్ కి ఎక్కేసింది .
ఇప్పటివరకు బుల్లితెరపైనే చూసిన వంటలక్క నటన ఇకపై మనం వెండితెరపై కూడా చూడబోతున్నాం. ఇప్పటికే కొన్ని సినిమాల్లో చిన్నచితకా పాత్రలో కనిపించిన పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండటం నిజంగా వంటలక్క అదృష్టం అనే చెప్పాలి. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చిత్ర బృందం అనౌన్స్ చేసింది. మనకు తెలిసిందే నాగచైతన్య వరుస ప్రాప్ సినిమాలతో అల్లాడిపోతున్నాడు . ఈ క్రమంలోనే తన ఆశలన్నీ వెంకట్ ప్రభు తో తెరకెక్కించే సినిమా పైనే పెట్టుకుని ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి నటిస్తుంది. అంతే కాదు ఈ సినిమాలో ప్రియమణి, వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళు నటిస్తున్నారు.
Welcoming the Television Queen and Versatile Actress #PremiVishwanath on board for our #NC22 💫🔥@chay_akkineni @vp_offl @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @SS_Screens @srkathiir @rajeevan69 @abburiravi #VP11 pic.twitter.com/FrsJSeAHQQ
— Srinivasaa Silver Screen (@SS_Screens) October 14, 2022