ఒక్క వీడియో ప్రభాస్ జీవితానే మార్చేసిందిగా..ఏం జనాలు రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాల జీవితం తలకిందులు అయిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ జీవితాలతో ఈ సోషల్ మీడియా ఆటాఆడేసుకుంటుంది . ఎవరైనా స్టార్ సెలబ్రిటీ ఏదైనా హీరోయిన్ కి హగ్ ఇచ్చినా తప్పే.. షేక్ హ్యాండ్ ఇచ్చినా తప్పే ..ఆఖరికి ఏమి ఇవ్వకపోయినా తప్పే ..అలా జనాలు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా స్టార్ సెలబ్రిటీస్ పరువు తీసేస్తున్నారు . ఇప్పటికే ఇలాంటి వీడియోస్ చాలా మంది జీవితాలను సర్వనాశనం చేసింది. బంగారం లాంటి ఫ్రెండ్షిప్స్ ను స్పాయిల్ చేసింది. కాగా ఇప్పుడు అలాంటి ఒక వీడియోని ప్రభాస్ జీవితాన్ని టోటళ్ గా మార్చేసింది.

మనకు తెలిసిందే ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రాజ్యమేలుతున్నాడు. ఏ సినిమా చేసిన ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నాడు. అంతేనా ఒక్కో సినిమాకు దాదాపు 120 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ సౌత్ నార్త్ రెండింటిలోనూ క్రేజీ హీరోగా రికార్డులు బద్దలు కొడుతున్నాడు. కాగా ప్రజెంట్ ఇప్పుడు ప్రభాస్ అభిమానుల కళ్ళు అన్ని ఆది పురుష్ పైనే పడింది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రీజర్.. ఎలాంటి టాక్ ను దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు .

అయితే ఈ టీజర్ లాంచింగ్ ఈవెంట్ లో హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ ల మధ్య ఏదో ఉంది అంటూ జనాలు చెప్పుకునేలా కొన్ని సీన్స్ జరిగాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికీ సంబంధించిన పుకార్లు వైరల్ గా మారాయి. టీజర్ లాంచ్ ఈవెంట్ కి స్టేజి పైకి వచ్చే ముందు ప్రభాస్ కృతి సనన్ ను చేయి పట్టుకోమనడం ..టీజర్ లాంచింగ్ ఈవెంట్ కోసం స్టేజి పైకి వచ్చిన ప్రభాస్ కి అక్కడి హై ఎల్ఈడి ఎఫెక్ట్స్ కారణంగా చమటలు పోయడం.. ఈ క్రమంలోనే కృతి తుడుచుకోమని కొంగు ఇవ్వడం దాన్ని ప్రభాస్స్ రిజెక్ట్ చేయడం.. ఆ తర్వాత టీజర్ లాంచ్ అయిపోయాక ప్రభాస్ కృతి ని హగ్ చేసుకోవడం.. ఇవన్నీ కలిపిన ఓ వీడియో సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారింది.

మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఈ వీడియోని క్రియేట్ చేశారు కొందరు ట్రోలర్స్. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది అంటూ మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఆ వీడియో ఆ కంట ఈ కంట పడి ప్రభాస్ వాళ్ళ అమ్మగారు కంట పడింది. దీంతో ఆమె నీకు ఇష్టం అయితే పెళ్లి చేస్తాం చెప్పురా అంటూ ఫోర్స్ చేయడంతో.. ప్రభాస్ కి కోపం వచ్చిందట. ఇక పై ఆమెకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఏ హీరోయిన్ తో నూ ఇలా క్లోజ్ గా ఉండకూడదని సిద్ధపడ్డాడట. దీంతో జనాలు చేసిన చిల్లర పనికి ప్రభాస్ బలైపోయాడు అంటున్నారు ఫ్యాన్స్..!!