ఆ హీరోయిన్స్ చేసిన తప్పు నేను చేయను..పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్..!?

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రజెంట్ చేతిలో ఉన్న నాలుగు సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది. కెరియర్ స్టార్టింగ్ లో ఒక్క హిట్ కొట్టడానికి నానాదంటాలు పడిన ఈ బుట్ట బొమ్మ ..ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం అనే సినిమాతో ట్రాక్ లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన అరవింద రాఘవ వీర సమేత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అప్పటినుంచి పూజ హెగ్డే కెరియర్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. ఏ సినిమా చేసిన సూపర్ హిట్ ..ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో అమ్మడు ఏకంగా అదృష్ట దేవత అంటూ పొగిడేసారు దర్శక నిర్మాతలు.

ఈ క్రమంలోనే వరుసగా హిట్లు కొట్టుకుంటూ పూజా హెగ్డే దాదాపు ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగిపోయింది. కాగా సీన్ కట్ చేస్తే ఆమె లాస్ట్ గా నటించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచాయి. ఆశ్చర్యం ఏంటంటే ముగ్గురు స్టార్ హీరోలే. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో చేసిన రాధేశ్యామ్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో బీస్ట్ సినిమా నిరాశపరిచింది. ఇక ఆ తరువాత భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రిలీజ్ అయిన ఆచార్య మూవీ పరమ చెత్త టాక్ ను సంపాదించుకుంది. ఇలా వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో పూజ హెగ్డే కు ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేశారు జనాలు.

కాగా రీసెంట్గా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ..సంచలన కామెంట్స్ చేసింది. “సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్టు పడితే హైప్ ఇచ్చే జనాలు ..ఒక ఫ్లాప్ పడగానే పాతాళానికి తొక్కేస్తారు .ఈ అనుభవం నాకు కొత్త ..ఇప్పుడిప్పుడే ఆ బాధలను తట్టుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు పేర్లు చెప్పకుండా పరోక్షకంగా కాజల్ సమంతలపై షాకింగ్ కామెంట్స్ చేసింది పూజా హెగ్డే . “పెళ్లి తర్వాత నేను సినిమాలో నటించను అని.. పూర్తి లైఫ్ ఫ్యామిలీకి అంకితం చేస్తానని “చెప్పి షాక్ ఇచ్చింది. అంటేపెళ్లయిన తర్వాత కాజల్, సమంత లైఫ్ని పట్టించుకోవడంలేదని అర్థం అంటున్నారు జనాలు. దీంతో పూజా కామెంట్స్ వైరల్ గా మారాయి.