ఎస్ ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి గాల్లో తేలిపోతుంది. దానికి బిగ్గెస్ట్ కారణం ఏకం గా రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ ని సొంతం చేసుకోవడమే. ఇవన్నీ చూస్తుంటే 2021 సాయి పల్లవికి బాగా కలిసి వచ్చింది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆమె నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా బాక్స్ ఆఫిస్ ని షేక్ చేసాయి. దీంతో తన ఖాతాలో రెండు హిట్లు వేసుకుంది. దీంతో మరోసారి సాయి పల్లవి తాను ఓ గొప్ప నటి అని ప్రూవ్ చేసుకుంది.
రీసెంట్గా జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ లో సాయి పల్లవి కి బెస్ట్ హీరోయిన్ గా రెండు సినిమాలకు అవార్డులు అందుకుంది . అందులో ఒకటి నాగచైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా. మరొకటి నాని హీరో గా నటించిన శ్యామ్ సింగరాయ్ లో దేవదాసిగా నటించిన సినిమా. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి తన అద్భుతమైన నటనతో జనాలను మంత్రముగ్ధులను చేసింది . దీంతో ఆడియన్స్ ఆమెకు బెస్ట్ హీరోయిన్గా అవార్డు ఇచ్చారు.
రీసెంట్గా జరిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో సాయి పల్లవి రెండు ఫిలింఫేర్ అవార్డును అందుకొని హ్యాపీగా దానికి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. దీంతో సాయి పల్లవి ఫాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు . కాగా లవ్ స్టోరీ సినిమాలో మౌనిక పాత్రలో సాయి పల్లవి నటన అద్భుతం .. విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తారు. ఇక నాని శ్యాం సింగరాయ సినిమాలో దేవదాసిగా ఆమె నటించిన తీరు మరే హీరోయిన్ కూడా నటించలేదని జనాలు బల్ల గుద్ది చెప్పారు ..అంతలా తన నటనతో మైమరిపించేసింది . ఏది ఏమైనా సరే ఇలా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న హీరోయిన్ ఇప్పుడు ఒక్క సినిమాకి కూడా సైన్ చేయకపోవడం కొంచెం బాధ కలిగించే విషయమే. కాగా సాయి పల్లవికి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీస్.
View this post on Instagram