ఎమ్మిగనూరు మళ్ళీ చేజారుతుందా?

కర్నూలు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా..ఇక్కడ వైసీపీకి స్ట్రాంగ్ పునాదులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువ ఉండటం..ఆ వర్గం వన్ సైడ్‌గా వైసీపీకి మద్ధతుగా నిలబడుతుండటంతో జిల్లాలో టీడీపీకి పెద్ద స్కోప్ రావడం లేదు. అయితే టీడీపీలో కూడా కొందరు బలమైన రెడ్డి నేతలు ఉన్నారు. వారు కొన్ని స్థానాల్లో ప్రభావం చూపగలరు. అలా టీడీపీ ప్రభావం కాస్త ఉన్న స్థానాల్లో ఎమ్మిగనూరు కూడా ఒకటి.

1985 టూ 1999 ఎన్నికల వరకు వరుసగా నాలుగుసార్లు టీడీపీ నుంచి బీవీ మోహన్ రెడ్డి గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే 2014లో మోహన్ రెడ్డి వారసుడు జయనాగేశ్వర్ రెడ్డి టీడీపీ నుంచి సత్తా చాటారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. వైసీపీ నుంచి చెన్నకేశవ రెడ్డి విజయం సాధించారు. ఇక అక్కడ పట్టు సాధించాలని టీడీపీ నేత జయనాగేశ్వర్ రెడ్డి ట్రై చేస్తున్నారు. కానీ ఎమ్మిగనూరులో వైసీపీకి చెక్ పెట్టలేకపోతున్నారు.

ఉమ్మడి జిల్లాలో బనగానపల్లె, కర్నూలు, మంత్రాలయం, ఆలూరు, డోన్ లాంటి సీట్లలో టీడీపీ బలం పెరిగినట్లు కనిపిస్తోంది.  మిగిలిన సీట్లలో టీడీపీ ప్రభావం చూపలేకపోతుంది. కాకపోతే ఎమ్మిగనూరులో టీడీపీకి బలపడేందుకు అవకాశాలు వచ్చాయి..కానీ వాటిని జయనాగేశ్వర్ సరిగ్గా యూజ్ చేసుకున్నట్లు కనిపించడం లేదు. నియోజకవర్గంలో అనుకున్న మేర అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగడం లేదు. వాటిని బాగా ఫోకస్ చేయొచ్చు..ప్రజా సమస్యలపై నాగేశ్వర్ రెడ్డి అనుకున్న స్థాయిలో పోరాటం చేస్తున్నట్లు కనిపించడం లేదు.

పైగా నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జయనాగేశ్వర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీని వల్ల అక్కడ పార్టీ పరిస్తితి మెరుగు అవ్వడం లేదు. ఈ మూడేళ్లలో జయనాగేశ్వర్ పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు కూడా కనిపించడం లేదు. ఈ పరిస్తితిని బట్టి చూస్తుంటే మళ్ళీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు టీడీపీ నుంచి జారిపోయేలా ఉంది.