సమంత-నాగచైతన్యతో కలిసి జీవించడానికె ఇలా చేస్తోందా..?

టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు పొందిన సమంత నాగచైతన్య ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వీరిద్దరూ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించి వివాహం చేసుకొని గత ఏడాది కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది. అయితే వీరి విడిపోయిన విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు కూడా ఇప్పటికీ అంతు చిక్కడం లేదని అభిమానులు భావిస్తూ ఉన్నారు. కానీ సమంత మాత్రం నాగచైతన్యత విడిపోయిన తర్వాత ఒకవైపు సినిమాలలో మరొకవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.

Samantha Viral Post on Instagram

ఇక అప్పుడప్పుడు సమంత కొన్నిసార్లు కొన్ని కొటేషన్లు షేర్ చేయడం వల్ల అవి చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటి అన్నిటికి పులిస్టాప్ పెడితే తమంత తాజాగా సోషల్ మీడియాలో నిన్నటి రోజున ఒక పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పోస్టు కాస్త వైరల్ గా మారుతోంది.

Samantha: ఎప్పటికి ఒంటరిగా నడవలేవు అంటూ సమంత పోస్ట్.. ఎవరికోసమో? – Telugu  Online News

సమంత ధరించిన టీ షర్టు ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ టీ షర్టు పైన “యు విల్ నెవర్ వాక్ అలోన్” అనే క్యాప్షన్ ప్రింట్ చేసి ఉంది. ఆ క్యాప్షన్ ని జత చేస్తూ..”ఒకవేళ మీరు దీన్ని కూడా వినవలసి వస్తే నువ్వు ఎల్లప్పుడూ ఒంటరిగా నడవలేవు అంటూ పోస్ట్ చేసింది”. దీంతో సమంత మళ్ళీ పెళ్లి చేసుకోబోతోందా లేదంటే ధనుష్,ఐశ్వర్య లాగా సమంత, నాగచైతన్య కూడా కలవనున్నారా అనే ఊహాగానాలు అభిమానులు మొదలవుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే సమంత నాగచైతన్య ను కలవడానికి చాలా ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నోసార్లు సమంత నాగచైతన్యాన్ని ఉద్దేశించి పలు పోస్టులు చేయడం మనం చూసే ఉన్నాము.. మరి రాబోయే రోజుల్లో సమంత నాగచైతన్య కలుస్తారేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)