అక్కినేని హీరోలు తమ సినిమాల వల్ల ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?

టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం నుంచి ప్రస్తుతం నాగార్జున తన కుమారులు అఖిల్ ,నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు కూడా వరుసగా సినిమాలు చేస్తూ చాలా హుషారుగా ఉన్నారని చెప్పవచ్చు. అయితే మరొకసారి వరుస డిజాస్టర్ లతో కాస్త వెనుక బడి ఉన్నారు. ఇక నాగార్జున అయితే వరుసగా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక చివరిగా నాగార్జున బంగార్రాజు చిత్రంలో తన కొడుకుతో కలిసి మంచి విజయాన్ని అందుకున్నారు.

Akkineni heroes targeting 2021 summer - TeluguBulletin.com
సంక్రాంతి రేసులో వచ్చిన ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. ఇక పండుగ సీజన్ కావడంతో కలెక్షన్ల పరంగా కూడా బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా పెట్టుబడి వచ్చి రూ.39 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. అంతకుమించి వచ్చినట్లుగా సమాచారం. ఇక నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది . ఈ చిత్రాన్ని డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమా రూ. 24 కోట్ల రూపాయలు బిజినెస్ జరగగా.. అయితే ఈ సినిమా కేవలం రూ.4 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో రూ.20 కోట్ల రూపాయలు నష్టాన్ని తెచ్చిపెట్టింది.

నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా రూ.22 కోట్ల రూపాయలు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా ఏకంగా రూ.12 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉన్నట్లుగా రెండు వర్గాలు తెలియజేస్తున్నాయి. దీంతో అక్కినేని మరొక హీరో అఖిల్ ఏజెంట్ సినిమాతో రాబోతున్నారు మరియు చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. మరి అఖిల్ అయినా అభిమానులకు ఫుల్ మీల్స్ పెడతారేమో చూడాలి.