ఆ హీరోయిన్ లా కాజల్ అగర్వాల్ మెప్పించగలదా..!!

మొదట లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజోల్ అగర్వాల్ ఆ సినిమాలో తన అందం,అభినయం నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా మంచి విజయం కావడంతో ఇమే తెలుగులో పాటు తమిళ్ ,హిందీ వంటి భాషలలో కూడా నటించింది. అలా స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. ఇలా సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది ఇటీవలే ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

Chandramukhi 2: साउथ एक्ट्रेस Kajal Aggarwal फिल्म 'चंद्रमुखी' 2 में आएंगी  नजर
ఇక తను గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో సినిమాలు అవకాశాలు వచ్చాయి కానీ ఇందులో చాలా సినిమాలను వదిలేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇండియన్ -2 లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల చాలా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజగా మరొక చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్న వాటి గురించి చూద్దాం.

Jyothika's breathtaking performances in Tamil movies | The Times of India
ఇక ఇటీవల ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2005 లో విడుదలైన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా ఉన్న చంద్రముఖి -2 సినిమాలో కీలకమైన పాత్రలో నటించేందుకు కాజల్ అగర్వాల్ అవకాశాన్ని అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కాజల్ నటిన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను హీరోయిన్ జ్యోతిక లాగా ఆకట్టుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా అభిమానులలో మొదలవుతున్నాయి. ఈ చిత్రాన్ని పి వాసు దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఇక ఈ చిత్రంలో తమిళ కమెడియన్ వడివేలు ,రాధిక శరత్ కుమార్ తదితరులు కీలకమైన పాత్రలు నటిస్తున్నారు.