వాట్: 2023లో ఆ స్టార్ హీరోల సినిమాలు రావా..? పెద్ద షాక్ ఇచ్చారుగా..!!

022వ సంవత్సరం ముగింపు దశకు రావడంతో సినీ అభిమానులు వచ్చే సంవత్సరం రాబోయే పెద్ద హీరోల సినిమాలు గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంలోనే వచ్చే సంవత్సరం కొంతమంది స్టార్ హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరు. ఆ స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. ఆ హీరోల అభిమానులకు కొంత నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ మొదలు కాలేదు. ఈ కారణంగా వారి సినిమాలు వచ్చే సంవత్సరం విడుదల చేయలేకపోతున్నారు.

NTR 30 To Get More Delay

వారిలో ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ హీరోలు అల్లు అర్జున్. ఆయన హీరోగా వచ్చిన పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా లెవెల్ లో భారీ సంచలనమైన విజయం అందుకుంది. దానికి సిక్వెల్ గా పుష్ప 2 రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఫ్రీ ప్రొడక్షన్ పనులు అవ్వకపోవడంతో సినిమా షూటింగ్ ఇంక మొదలు కాలేదు. ఈ కారణంగా ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేదు.

ఈ కారణంగా 2023లో అల్లు అర్జున్ సినిమా లేనట్టే.. ఇంకో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా షూటింగ్ కూడా ఇంకా మొదలుపెట్టలేదు. తన తర్వాత సినిమాని కొరటాల శివతో అనౌన్స్ చేసిన ఎన్టీఆర్.. అనౌన్స్ చేసి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఇప్పటికి కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా 2023లో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమ షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా ఇంకో షెడ్యూల్ కూడా మొదలుపెట్టారు. శంకర్ ఈ సినిమాతో పాటు కమలహాసన్ భారతీయుడు2 సినిమా కూడా తీస్తుండడంతో ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా లేదు.