NBK 107:వైరల్ గా మారుతున్న బాలకృష్ణ వీడియో సాంగ్..!!

బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు .గతంలో కూడా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరిగింది. ఇక అలాగే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలలో కూడా జరిగింది. ఆ సమయంలో జై బాలయ్య అనే సాంగ్కు సంబంధించి పలు క్లిప్స్ కూడా వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక సాంగ్ లీక్ కావడం జరిగింది.

BalaKrishna - Twitter Search / Twitter
సుగుణసుందరి అనే లిరిక్ తో సాగే ఈ పాట సంబంధించి కొన్ని సెకన్ల వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఈ సాంగ్ షూటింగ్ జరగు తూ ఉండగ చిత్ర యూనిట్ కు సంబంధించిన వాళ్ళే ఈ సినిమా వీడియో ను లిక్ చేశారని కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక బాలయ్య నుంచి వరుసగా ఫోటోలు వీడియోలు లీక్ అవుతూ ఉండడంతో అభిమానులు కూడా కాస్త నిరుత్సాహపడుతున్నారు. బాలకృష్ణ 107 సినిమాకు సంబంధించి ఎలాంటి కాకుండా చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటివి మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి.

ఇక బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాలయ్య 107 వ సినిమా కూడా రూ.70 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాను కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదలపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం లీకైన ఈ వీడియో పై అభిమానులకు కూడా మరింత ఆసక్తిని పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

https://twitter.com/Sabrish110/status/1579795126511366146?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579795126511366146%7Ctwgr%5Edce3315360190f7e9175466dfe26057d3bb5c3d1%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.filmyfocus.com%2Fvideo-leaked-from-balakrishna-gopichand-malineni-movie%2F