బాలకృష్ణ రికార్డుని.. టచ్ చేయలేకపోయిన చిరు..!

టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ మధ్య ఎప్పటినుంచో తీవ్రమైన పోటీ ఉంది అన్న విషయం మనకు తెలిసిందే. ఇద్ద‌రు టాలీవుడ్ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళని అంటుంటారు. వీరిద్దరూ సినిమాల పరంగా టాలీవుడ్ లో చాలాసార్లు పోటీపడ్డారు. ఒకరిని మించి ఒకరు సినిమాలు తీసుకుంటూ ఇప్పుడు ఉన్న యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే. గత సంవత్సరం బాలకృష్ణ అఖండ సినిమాతో వచ్చి తనకు టాలీవుడ్‌కు అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఈ సినిమాతో బాలకృష్ణ తన పాత సినిమాలన్నీ ఒక ఎత్తు.. ఈ సినిమా ఒక ఎత్తు అనే విధంగా కలెక్షన్లను రాబట్టింది. బాలకృష్ణ సినిమాలు అన్నిటిలో కన్నా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

Nandamuri Balakrishna donates Rs 1.25 crore to coronavirus relief efforts.  Chiranjeevi thanks him - Movies News

తర్వాత చిరంజీవి ఆచార్య సినిమాతో వచ్చి బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇప్పుడు చిరంజీవి దసరా కానుకగా తన కొత్త సినిమా అయినా గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక మొదటి ఆటతో సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమా మొదటిరోజు భారీగానే కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి అభిమానులు గాడ్ ఫాదర్ సినిమా హిట్ అవ్వటంతో ఫస్ట్ డే కలెక్షన్లు భారీగా వచ్చాయని ఇతర హీరోల సినిమాలతో పోల్చుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

God Father Vs NBK 107: Netizens Competing For Chiranjeevi, Balayya

ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. ఏపీ సర్కార్ టికెట్ల రేట్లు తగ్గించిన విషయం మనకు తెలిసిందే. ఆ టైంలో విడుదలైన అఖండ టాలీవుడ్ లోనే సూప‌ర్‌ హిట్ సినిమాగా నిలిచింది. అయితే గాడ్ ఫాదర్ టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్న సమయంలో కూడా అఖండ రేంజ్ కలెక్షన్లను సాధించలేకపోయింది అన్నది వాస్తవం. రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.

Akhanda Vs God Father Day 1 Collections | వినోదం News in Telugu
నైజాం : 4.39 కోట్లు, గాడ్ ఫాదర్ నైజాం: 3.29 కోట్లు. అఖండ
సీడెడ్ : 4.02 కోట్లుగాడ్ ఫాదర్: 3.18 కోట్లు
ఉత్తరాంధ్రలో అఖండ 1.36 కోట్లుగాడ్ ఫాదర్ 1.26 కోట్లు
ఈస్ట్ గోదావరిలో అఖండ 1.05 కోట్లు, గాడ్ ఫాదర్ 1.60 కోట్లు.
వెస్ట్ గోదావరిలో అఖండ 96 లక్షలు,గాడ్ ఫాదర్ 59 లక్షలు
గుంటూరు లో అఖండ 1.87 కోట్లు,గాడ్ ఫాదర్ 1.75 కోట్లు.
కృష్ణ : 81 లక్షలుకృష్ణా: 73 లక్షలు
నెల్లూరు : 93 లక్షలునెల్లూరు: 57 లక్షలు
కర్ణాటక +రెస్టాఫ్ ఇండియా అఖండ 1 కోటి, గాడ్ ఫాదర్ 1.56 కోట్లు+ హిందీ; 45 లక్షలు
అఖండ మొదటి రోజు కలెక్షన్లు చేసుకుంటే 18.74 కోట్లు ( 29.5 కోట్లు గ్రాస్)
గాడ్ ఫాదర్ మొదటి రోజు కలెక్షన్ చూసుకుంటే 17.08 కోట్లు (31.10 కోట్లు గ్రాస్).