అలాంటప్పుడు కమిట్ ఇస్తే తప్పు లేదంటున్న బిగ్ బాస్ దివి..!!

దివి అనే పేరు చెప్తే పెద్దగా తెలియదు కానీ బిగ్ బాస్ బ్యూటీ దివి అంటే చాలామందికి తెలుసు. ముఖ్యంగా బిగ్ బాస్ -4 లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ హౌస్ లో కనబరిచిన ఆట తీరు చాలామంది ప్రేక్షకులు ఈమెకు ఫ్యాన్ అయ్యేలా చేసింది. అలా ఏకంగా మూడు సినిమాలలో అవకాశాన్ని సంపాదించుకుంది. మరి ముఖ్యంగా చిరంజీవితో నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా నటించింది ఈమె కెరియర్ మొదట్లో గో, సీన్ నెంబర్ -72 వంటి చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి చిత్రంలో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్లు నటించింది.

Bigg boss: Divi eliminated from the house and Monal is safe
ఆ తర్వాతే బిగ్ బాస్ -4 లో చిరంజీవి గ్రాండ్ ఫినాలే లోకి గెస్ట్ గా రావడంతో ఆ గ్రాండ్ ఫినాలే లో స్టేజ్ మీద చిరంజీవి ఈమెను చూసి తన సినిమాలో ఒక క్యారెక్టర్ ఇస్తానని మాట ఇచ్చారట. ఇక ఇచ్చిన మాట ప్రకారం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఈమెకు ఒక అవకాశం ఇచ్చారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్లో పాల్గొన్న దివి కాస్టింగ్ కౌచ్ విషయం గురించి తెలిపింది.

Bigg boss 4 contestant actress Divi Vadthya trendy poses-దివి వాద్త్యా  మస్తీ ఫొటోస్
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఉంటుంది అనేది చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈ విషయంలో తనని ఎవరు అలా అడగలేదని అది వాస్తవం కాదని తెలియజేసింది. కేవలం కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది సినీ కెరియర్లో ఎదగాలనుకుంటే వారు ఇలాంటి విషయాలు పట్టించుకోరు. మరి కొంతమంది మాత్రం అలాంటి పని చేయడానికి ఇష్టం లేక రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో కొంతమంది ఇష్టం ఉండి కెరియర్ కోసం కమిస్ట్మెంట్ అయితే తన దృష్టిలో అది పెద్ద తప్పు కాదని తెలియజేస్తోంది. ఒకవేళ ఇష్టం లేకపోతే బలవంతంగా కమిట్మెంట్ అడిగితే అది తప్పే అని తెలియజేస్తోంది దివి . ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.