దానికి నిరసనగా స్టార్ నటి నగ్న ప్రదర్శన… బట్టలు విప్పుతూ అది అన్యాయం అని ఆరోపిస్తోంది?

ఈమధ్య ఇరాన్‌కు చెందిన 22 సంవత్సరాలు వయసుగల ‘మహ్సా అమినే’ అనే యువతి ట్రెహ్రాన్ మెట్రో స్టేషన్ వద్ద హిజాబ్ సరిగ్గా ధరించలేదని పోలీసులు అరెస్టు చేసి, దారుణంగా చెంపేసిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఆ అమ్మాయి మరణంతో యువతులు, మహిళలు, పురుషులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇక ఇరాన్‌లోనే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో హిజాబ్ తీసేసి, జుట్టు కత్తిరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ధర్నాలు చేస్తున్నారు.

ఈ తరుణంలో తాజాగా ఇరాన్ సినిమా నటి అయినటువంటి ‘ఎల్నాజ్ నొరౌజీ’ తన నిరసనని వినూత్న రీతిలో తెలియజేసింది. కాగా దానికి సంబంధించినటువంటి వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆమె తాను ధరించే బట్టలు ఒక్కొక్కటిగా విప్పేసి హిజాబ్‌కు వ్యతిరేఖంగా తనదైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇక అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో ఈ నటి తాజాగా షేర్ చేసింది.