నవంబర్ లో 10 రోజులు బ్యాంకులు క్లోజ్.. కారణం ఇదే..!!

నవంబర్ నెలలో బ్యాంకులకు 10 రోజులకు పైగా సెలవులు రానున్నాయి.. దీనివలన దేశంలో ఉన్న వివిధ రకాల బ్యాంకులు మూతపడనున్నాయి. ఇప్పుడు ఉన్న డిజిటల్ కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని కీలక బ్యాంక్ పనులను పూర్తి చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళటం తప్పనిసరి అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం సెలవుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Bank Holidays: Banks will remain closed for 10 days in November, see full  list here

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక పండగలకు అనుగుణంగా సెలవులు వస్తుంటాయి. వివిధ రాష్ట్రాల లోని బ్యాంకులకు వేరువేరుగా సెలవులు ఉంటాయి. నవంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 10 రోజులు సెలవులు వచ్చాయని గమనించండి. నవంబర్‌లో ఏ రోజులు సెలవులు ఉంటాయి ఇప్పుడు చూద్దాం.

నవంబర్ 2022 బ్యాంక్ సెలవులు..

November:1 కన్నడ రాజ్యోత్సవం/కుట్

November:8 గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ/రహస్ పూర్ణిమ

November:11 కనకదాస జయంతి/వంగల ఉత్సవం

November:12 రెండవ శనివారం

November:13 ఆదివారం

November:20 ఆదివారం

November:23 సెంగ్ కుత్స్నెం

November:26 నాల్గవ శనివారం

November:27 ఆదివారం

RBI సెలవులను మూడు కేటగిరీలుగా విభజించింది..

Banks to be closed for 17 days in November 2021; check complete list here

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు మూడు బ్రాకెట్ల కింద సెలవులను విభజించింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్, బ్యాంకుల ఖాతాల ముగింపు కింద ఉంటాయి. బ్యాంకు సెలవులు వివిధ రాష్ట్రాల్లో మారుతూ ఉంటాయి. ఈ రూల్స్ అన్ని బ్యాంక్ కంపెనీలు పాటించవు. గెజిట్ సెలవులు, పండుగల సెలవులు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. అయితే సెలవుల సమయంలోనూ ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి వినియోగదారులు వారి పనులను పూర్తి చేసుకునేందుకు వీటిని వినియోగించుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.