2024 ఎన్నిక‌లు టార్గెట్‌గా వైసీపీ బిగ్ స్కెచ్‌… 100కు పైగా యూట్యూబ్ ఛానెళ్లు..!

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. 100కు పైగానే యూట్యూబ్ ఛానెళ్లు. ఇవేవో.. వ్య‌క్తిగ‌తంగా వ‌చ్చే ఛానె ళ్లు కావు.. అధికారికంగా.. బ్రాడ్ కాస్టింగ్ ఆఫ్ ఇండియా వ‌ద్ద‌..న‌మోద‌య్యే ఛానెళ్లు. ఇవ‌న్నీ.. వ‌చ్చే 2024 లేదా.. అంత‌కుముందే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌కం కానున్నాయి. మ‌రి ఇవ‌న్నీ.. ఎవ‌రు బుక్ చేసుకున్నారు. ఎవ‌రు పేర్లు పెట్టుకున్నారు? అనే చ‌ర్చ స‌హ‌జం. ఇవ‌న్నీ.. వైసీపీ నేత‌ల‌వేన‌ని అంటున్నారు. ల‌క్ష్యం పెద్ద‌ది పేట్టుకున్న‌ప్పుడు.. దానిని సాధించేందుకు అంతే క‌ష్ట‌ప‌డాలి.

ఇదీ.. సీఎం జ‌గ‌న్ భావ‌న‌. అందుకే ఆయ‌న‌.. త‌న ల‌క్ష్యాన్ని సాధించేందుకు.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల‌ను ఎంగేజ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులు.. చివ‌ర‌కు తానుకూడా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రానున్నారు. అయితే.. దీనికి మించి.. అన్న‌ట్టుగా.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు.. ఆయ‌న యూట్యూబ్‌ను న‌మ్ముకున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశానికి.. ముందు జ‌రిగిన స‌మావేశంలోనే దీనిపై చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న‌కు శ‌త్రువులు పెరుగుతున్నారు. వారిని నేరుగా ఎదుర్కొన‌డంతోపాటు.. ప్ర‌త్య‌క్షంగా.. ప‌రోక్షంగా కూడా పైచేయి సాధించాలి.. అని జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. ఈ క్ర‌మంలోనే ఐప్యాక్ చేసిన సూచ‌న‌ల‌ మేర‌కు.. యూట్యూబ్ ఛానెళ్ల‌ను తీసుకురానున్నారు. వీటికి ఇప్ప‌టికే రంగం సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి వైసీపీ అనుకూల చానెళ్లు చాలానే ఉన్నాయి. అయితే.. అవి కాకుండా.. బ‌ల‌మైన ఎమ్మెల్యేలు.. వీటిని స్థాపించాల‌ని.. జ‌గ‌న్ నిర్దేశించార‌ట‌.

 

దీంతో 100 మంది యూట్యూబ్ చానెళ్ల కోసం.. అధికారికంగా అనుమ‌తులు తెచ్చుకునేందుకు రెడీ అయ్యార‌ని ప్ర‌స్తుతం ప్రాసెస్ న‌డుస్తోంద‌ని.. అంటున్నారు. ఇది ఓకే అయిపోతే.. ఇత‌ర ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేసుకుని.. వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ చానెళ్ల ద్వారా.. విస్తృత ప్రచారం చేస్తారు. అయితే..ఎక్క‌డా.. పార్టీ సింబ‌ల్ కానీ.. మ‌రొక‌టి కానీ.. ఉండ‌దు. ఉంటే..ఎన్నిక‌ల సంఘం అభ్యంత‌రం చెబుతుంది. సో.. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని.. ముందుకు సాగుతున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.