సౌందర్యను ఆ ఇద్దరు స్టార్ హీరోలు మోసం చేసారా..? లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నాయంటే.. !?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందం, అభినయం, తెలుగుదనంతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సౌందర్య. ఆ అందాల బొమ్మ సహజ సౌందర్యం తో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరింప చేసింది. అప్పట్లో సౌందర్య సౌత్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. అయితే ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే సినీ అవకాశాలు రావడంతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. సౌందర్య టాలీవుడ్ తో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో కూడా నటించింది.

టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, జగపతిబాబు వంటి వారందరి సరసన హీరోయిన్‌గా నటించింది. సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ ఉండడం సర్వసాధారణమైన విషయం. అయితే సినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న సౌందర్యకు అప్పట్లో కొన్ని ఎఫైర్స్ ఉన్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అయితే ఇక అప్పట్లో సౌందర్య – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ఎక్కువ సినిమాలే వచ్చాయి. అంతేకాకుండా వారు నటించిన ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఆ సమయంలో విక్టరీ వెంకటేష్ అప్పుడప్పుడు సౌందర్య ఇంటికి వెళ్లడం వారి ఇంట్లో జరిగే పండగలకి వెళ్లడం లాంటివి చేస్తూ ఉండేవాడట. దీంతో సినీ ఇండస్ట్రీలో వీరి మధ్య ఏదో నడుస్తుందని అప్పట్లో కొన్ని ప్రచారాలు అయితే జరిగాయి. ఆ త‌రువాత సౌంద‌ర్య ప్రముఖ స్టార్ హీరో జ‌గ‌ప‌తిబాబుతో కూడా ఎక్కువ సినిమాల‌లోనే న‌టించింది. ఇక దీంతో జగపతిబాబుతో కూడా హీరోయిన్ సౌందర్యకి ఎఫైర్ నడిచిందని కొంతమంది ప్రచారం చేశారు. అయితే అప్పట్లో జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సౌందర్య చనిపోయాక జగపతిబాబు ఆ డిప్రెష‌న్ నుంచి బయటికి రావడానికి చాలా సమయం పట్టిందట.

ఇక ఆ సమయంలో కొన్ని రోజులు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారట. సౌందర్య తనకి మంచి మిత్రురాలని ఏ విషయమైనా షేర్ చేసుకునే వాళ్ళని ఎఫైర్ అంటే అర్థం రిలేషన్షిప్ అని ఆయన బదులిచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరు కలిసి తిరిగిన మాట్లాడుకున్న ఇలాంటి పుకార్లు తప్పవని అది సినీ ఇండస్ట్రీలో సహజమని వీటి గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

 

Share post:

Latest