అది నిజం అని తెలిసి వెక్కి వెక్కి ఏడ్చేశాను..అలియా ఎమోషనల్..!?

బాలీవుడ్ అందాల భామ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బాలీవుడ్ లో అగ్ర కథానాయకగా కొనసాగుతుంది. బాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించి మెప్పించింది. అలియా భట్ ఈ సంవత్సరం ఏప్రిల్ 14 బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను వివాహంం చేసుకుంది. వీళ్ళిద్దరి వివాహం తర్వాత కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్‌ల‌ను చాలా వేగంగా చేస్తుంది. తాజాగా అలియాభట్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన కెరియర్ లోని ఒడిదొడుకుల గురించి ఓపెన్ అయింది. అలియా భట్ నటించిన ‘షాందర్’ 2015 లో వచ్చి పరాజయం పాలైయింది.

Brahmastra': Alia Bhatt, Ranbir Kapoor's love poster hints at their wedding

ఆలియా ఆ సినిమా టైంలో తీవ్రఓత్తిడి కి గురైనదట. ఆ సినిమాకి ముందు ఆలియా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఆ ఒక్క సినిమా ప్లాప్ కారణంగా చాలా కాలం ప్రశాంతంగా ఉండలేకపోయానని ఆలియా చెప్పింది. కొన్ని అనుకోని కారణాలవల్లే ఆ సినిమా ప్లాఫ్ అయిందని తెలిసింది. ఆ సినిమా డిజాస్టర్ అయిందని తెలిసిన మొదటి రోజు నేను నమ్మలేకపోయాను. తర్వాత అది నిజమైన తెలుసుకుని నా మనసులోని బాధను ఆపకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చేశాను ఆ టైంలో మా నాన్న సలహా మేరకు విహారయాత్రకు వెళ్లి రిలాక్స్ అయ్యాను. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఎంతటి బాధ వచ్చినా ఎదురు దెబ్బలు తగులుతున్న ధైర్యంగా సినిమాలు చేసుకుంటూ వచ్చాను. అని అలియాభట్ ఎమోషనల్ గా తన మనసులోని మాటలు చెప్పింది.

Share post:

Latest