తాజాగా జరిగిన ఆసియా కప్‌లో భాగంగా ఇండియాకు పాకిస్తాన్ కు జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా -పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఇండియా ఓడిపోవడంతో అభిమానులు ఆ ఓటమిని జీర్ణించుకోలేక సోషల్ మీడియా ద్వారా తమ కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదే క్రమంలో టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బూమ్రా తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ తన భార్యతో కలిసి ఫోటోలు దిగాడు ఆ ఫోటోలను బూమ్రా భార్య సంజన సోషల్ మీడియాలో పెట్టింది. ఆ ఫోటోలు చూసినా ఇండియా అభిమానులు సోషల్ మీడియా ద్వారా వాళ్లపై తీవ్ర విమర్శలు చేశారు.
వారు సోషల్ మీడియా ద్వారా వాళ్లపై తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు.. అక్కడ టీమ్ ఇండియా కష్టాల్లో ఉంటే మీరు ఇక్కడ సెలవులో ఎంజాయ్ చేస్తున్నారంటూ అంటూ ట్రోలింగ్‌కు దిగారు. ఇక దీంతో బూమ్రా భార్య వాళ్లపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తన సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేసిన వారిని తనదైన స్టైల్లో సెటైర్లు వేసింది. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే సంబంధం లేని విషయాల గురించి విమర్శించడం సరికాదు. ఇంటర్నెట్ ఉందని కదా ఏది పడితే అది అనటం సరికాదు. ఇంటర్నెట్ ని మెరుగైన సమాజం కోసం వాడటం తప్పు కాదు. సోషల్ మీడియా ద్వారా మెరుగైన ప్రదేశం గా మార్చటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానని హామీ ఇస్తున్న. లవ్ సంజన అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది.
View this post on Instagram