ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 6 ప్రారంభమైంది. ఈసారి 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వారిలో కొంతమంది సెలబ్రిటీలు, సీరియల్ ఆర్టిస్టులు, యూట్యూబర్స్, సామాన్యులు కూడా కొంతమంది హౌస్ లోకి అడుగు పెట్టారు. బిగ్‌బాస్‌ని ఇష్టపడే వాళ్లు కొంతమంది ఉంటే, అది నచ్చని వారు చాలామంది ఉన్నారు. ఇటీవల బిగ్‌బాస్ గురించి సీపీఎం నారాయణ లాంటి వారు చెడు వ్యాఖ్యలు చేసారు. తాజాగా సింగర్ స్మిత కూడా బిగ్‌బాస్ షో అంటే ఆమెకి అసలు నచ్చదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఆమె బిగ్‌బాస్ గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
ఒకవేళ బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినా కూడా తాను రిజెక్ట్ చేస్తానని, బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తప్పు చేయనని.. ఎందుకో తెలీదు కానీ ఆ షో అంటే అసలు నచ్చదని స్మిత చెప్పింది. “ఒక షో కోసం 100 రోజులు పాటు కుటుంబాన్ని వదిలేడం అవసరమా? స్టార్ మా వారు ఒక ఇంట్లోనే అందర్నీ ఉంచి తన్నుకోనివ్వండి. దాన్ని మేం టీవీలో చూపించి.. టీఆర్పీ పెంచుకోండి. కానీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు.” అని ఆమె వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది.
సింగర్ స్మిత మాట్లాడుతూ తను బిగ్‌బాస్ షోని అసలు చూడనని చెప్పింది. “ఒకవేళ చూసినా ఆ షో నాకు అసలు అర్థం కాదు. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినా, పారితోషికం రెట్టింపు ఇస్తానన్న సరే ఆ షోకి వెళ్లను. ఒకవేళ నా స్నేహితులు, తెలిసినవారు ఎవరయినా వెళ్తా అన్నకూడా వద్దు అని వారిని ఆపడానికి ట్రై చేస్తాను. కానీ వాళ్లని వెళ్ళమని ఎంకరేజ్ చేయను” అని చెప్పింది. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న వాళ్ల గురించి తాను కామెంట్ చేయనని పేర్కొంది. ఈ సీజన్ 6లో తనకు తెలిసిన వారు ఉన్నారు కాబట్టి వారి గురించి తానేం మాట్లాడ దలుచుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది.