రౌడీ హీరో విలన్ గానా..ఇదేం షాకింగ్ ట్వీస్ట్ సామీ..?

యంగ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే. పెళ్లి చూపులు సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ హీరో..అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా తన క్రేజ్ ను ఆకాశానికి పెంచేసుకున్నాడు. ఆ సినిమాలో ప్రీతి తో లిప్ కిస్..బెడ్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. అంతేకాదు..కొన్ని సీన్స్ కాంట్రవర్షీయల్ గాను నిలిచాయి. ఏదైతేనేం..ఓవర్ ఆల్ గా విజయ్ సక్సెస్ అయిపోయాడు.

ప్రజెంట్ ఈ హీరో వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో లైగర్ అనే సినిమా చేసిన ఈ హీరో..వెంటనే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “జనగణమన”కి కమిట్ అయ్యాడు. అంతేకాదు..శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత హీరోయిన్ గా ..విజయ్ దేవరకొండ ఇంకో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్..అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట లీకై సంచలనంగా మారింది. ఈ సినిమాలో విజయ్ మనకు డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడట. అంతేకాదు..ఫస్ట్ హాఫ్ లో హీరో గా సెకండ్ హాఫ్ లో విలన్ గా మనల్ని మెప్పించబోతున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతున్న విజయ్..విలన్ లుక్స్ లో కనిపించడానికి..ఓకే చేసి తప్పు చేసారా అనే డౌట్లు వస్తున్నాయి. మరి చూడాలి విజయ్ ఎలా మెప్పిస్తారో..?