సమంత సినిమాను ఆపేసిన నాగార్జున..బయటపడ్డ సంచలన విషయాలు..?

వాట్..సమంత సినిమాను ..నాగార్జున రిలీజ్ కాకుండా ఆపేశారా ..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మనకు తెలిసిందే..స్టార్ హీరోయిన్ సమంత, నాగార్జున కోడలు అని..కొద్ది నెలల క్రితమే..ఆమె ఆ పోస్ట్ నుండి తప్పుకుంది అని. అక్కినేని ఇంటి కోడలు గా ఉన్నప్పుడు సమంత ని ఇండస్ట్రీ పెద్దలు ఓ పెద్దింటి కోడలు గా చూశారు..అదే సమంత ఇప్పుడు అక్కినేని కోడలు ట్యాగ్ తీసేశాక మరోలా చూస్తున్నారు. అలా తగలాడింది ఈ సినీ ఇండస్ట్రీ అంటూ సామ్ ఫ్యాన్స్ మొత్తుకుంటున్నా..వినిపించుకునే నాదుడే లేడు.

అయితే, విడాకుల తరువాత సమంత మానసికంగా చాలా బాధపడ్డింది. అంతా ఇంతా కాదు..తన బాధను ఎవ్వరికి చెప్పుకోలేక..కెరీర్ ని వదులుకోలేక..నరకం చూసింది..రాత్రి పగలు ఏడ్చి ఏడ్చి..ఇలా సమాజంలో బ్రతకలేం అని అనుకుని..తనకు నచ్చిన్నట్లు ఉండటం స్టార్ట్ చేసింది. నచ్చింది చేసుకుంటు..నచ్చనిది వదిలేసుకుంటూ..లైఫ్ ను ఏంజాయ్ చేస్తుంది. సమంత కి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది..బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ లో కోలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది.

అయితే, ఆమె నటించిన శాకుంతలం సినిమా తాలుకా నుండి చప్పుడే లేదు. మొదట్లో ఈ సినిమా టైంలో ఎంత హంగామా చేశారో మనకు తెలిసిందే. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుంది. అస్సలు రిలీజ్ అవుతుందా లేదా..? అనే ప్రశ్నలు మొదులుతున్నాయి. అయితే, తాజాగా సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త రూమర్ తెగ హల్ చల్ చేస్తుంది.

సమంత సినిమాలని కావాలనే మాజీ మామ గారు ఆపేస్తున్నారని..ఆమె ని టాలీవుడ్ లో ఎదగనీకుండా చేయాలని చూస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఆయనకు ఉన్న పలుకబడితో..సామ్ ని తొక్కేయాలని చూస్తున్నారట. అందుకే ఆమె శాకుంతాలం సినిమాని రిలీజ్ కాకుండా అడ్డుకుంటున్నారని సినీ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరో పై ఇలాంటి రూమర్ నిజంగా ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుందనే అంటున్నారు సినీ విశ్లేషకులు.